Nandamuri Balakrishna daughter Tejaswini to make her first on-screen appearance
Nandamuri Tejaswini: నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులకు ఎండ్ కార్డు వేశాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా (Nandamuri Tejaswini)మోక్షజ్ఞతో కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. దానికి సంబందించి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. నందమూరి వంశానికి అసలైన వారసుడు వచ్చాడు అంటూ సంబరాలు చేసుకున్నారు. అదే రేంజ్ లో సినిమా కూడా ఉండబోతుంది అని ఫిక్స్ అయిపోయారు. కానీ, ఏమయిందో తెలియదు ఆ సినిమా ఇప్పటివరకు మొదలవలేదు. దీంతో, అభిమానుల ఎదురుచూపులు మళ్ళీ మొదలయ్యాయి.
AA22xA6: రూ.850 కోట్ల సినిమా రోబోలా ఉంటుందా.. అట్లీ గురించి తెలిసిందేగా.. ఇలా అయితే ఎలా..
ఇదిలా ఉంటే, మోక్షజ్ఞ కంటే ముందే అతని అక్క, నందమూరి బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని నందమూరి ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ ఇవ్వనున్నారట. ఆమె మొదటిసారి కెమెరా ముందుకు కనిపించబోతున్నారట. అయితే అది సినిమా కోసం కాదు. ఒక యాడ్ షూట్ కోసం. ప్రముఖ సంస్థకు సంబందించిన యాడ్ లో ఆమె కనిపించబోతున్నారట. దీనికి సంబందించిన షూట్ కూడా ఇప్పటికే కంప్లీట్ అయిందని టాక్. త్వరలోనే ఈ యాడ్ టెలికాస్ట్ కానుందట. దీంతో, నందమూరి అభిమానులు కాస్త హ్యాపీ ఫీలవుతున్నారు.
ఇక బాలకృష్ణ విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన మాస్ దర్శకుడు బోయపాటి శ్రీనుతో అఖండ 2: తాండవం సినిమా చేస్తున్నాడు. బ్లాక్ బస్టర్ అఖండ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన అఖండ 2 టీజర్ అంచనాలు పెంచేయగా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.