AA22xA6: రూ.850 కోట్ల సినిమా రోబోలా ఉంటుందా.. అట్లీ గురించి తెలిసిందేగా.. ఇలా అయితే ఎలా..

పుష్ప 2 సినిమాతో ఇండియన్ సినీ ఇండస్ట్రీలో (AA22xA6)ఉన్న అన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేసేశాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది.

AA22xA6: రూ.850 కోట్ల సినిమా రోబోలా ఉంటుందా.. అట్లీ గురించి తెలిసిందేగా.. ఇలా అయితే ఎలా..

Allu Arjun's new movie story is going viral on social media.

Updated On : October 8, 2025 / 8:17 PM IST

AA22xA6: పుష్ప 2 సినిమాతో ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేసేశాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. (AA22xA6)దాంతో, తన నెక్స్ట్ సినిమాను కూడా అదే రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. అందుకోసం తమిళ దర్శకుడు అట్లీని సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ దర్శకుడు చెప్పిన హాలీవుడ్ రేంజ్ సైన్స్ ఫిక్షన్ కథను ఒకే చేశాడు. ఈమధ్యనే షూటింగ్ స్టార్ట్ అయినా ఈ భారీ ప్రాజెక్టును సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఏకంగా రూ.800 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారని టాక్.

Kiran Abbavaram: తెలుగు సినిమాలకు అన్యాయం.. ఆలోచింపజేస్తున్న కిరణ్ అబ్బవరం కామెంట్స్

ఇక ఈ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చినప్పటినుంచి అందరిలోనూ ఒక క్యూరియాసిటీ మొదలయ్యింది. ఈ సినిమా గురించి తెలుసుకోవడానికి తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అనౌన్స్ మెంట్ వీడియో ఆ క్యూరియాసిటీని రెట్టింపు చేసింది. అయితే, ఈ సినిమా గురించి, సినిమా కథ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ అవుతోంది. అదేంటంటే, ఈ సినిమా కథ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ రోబోలా ఉండనుందట. ఈ సినిమాలో మాదిరిగానే అల్లు అర్జున్ సినిమాలో కూడా ఒక కంట్రోల్ తప్పిన ఒక రోబో బీభత్సమ్ సృష్టిస్తుంది. అది ప్రపంచవినాశనాన్ని కోరుకుంటుందట. ఆ వినాశనం నుంచి మానవాళిని, ఈ భూమిని రక్షించడానికి సూపర్ హీరోలా వస్తాడట అల్లు అర్జున్.

ఇదే మెయిన్ కథగా అల్లు అర్జున్-అట్లీ సినిమా రానుంది అని తెలుస్తోంది. అయితే, కథ రోబో సినిమాలా అనిపించినా దాన్ని ప్రెజెంట్ చేసే విధానం చాలా కొత్తగా ఉండబోతుంది. ఇంతవరకు ఇండియన్ సినీ చరిత్రలో కనీవినీ ఎరుగని రేంజ్ లో ఈ సినిమాను ప్రెజెంట్ చేయబోతున్నాడట అట్లీ. ఆ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావడం లేదట. నిజానికి అట్లీ గత చిత్రాలు చూస్తే మనకు ఇదే అర్థం అవుతుంది. అట్లీ కథలన్నీ రొటీన్ గానే ఉంటాయి. కానీ, ప్రెజెంటేషన్ చాలా కొత్తగా ఉంటుంది. కథను ఎమోషనల్ టచ్ ఇచ్చి ఆడియన్స్ ను మెస్మరైజ్ చేయడంలో అట్లీ దిట్ట. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా కోసం కూడా అదే ఫాలో అవుతున్నాడట. మరి ఈ సినిమా ఆడియన్స్ కు ఎలాంటి అనుభూతిని పంచుతుంది అనేది చూడాలి.