Kiran Abbavaram: తెలుగు సినిమాలకు అన్యాయం.. ఆలోచింపజేస్తున్న కిరణ్ అబ్బవరం కామెంట్స్
తెలుగు ఆడియన్స్ కి సినిమా అంటే పిచ్చి. సినిమా బాగుంటే హీరోతో, భాషతో సంబంధం(Kiran Abbavaram) లేకుండా ఆదరించడానికి ముందుకు వస్తారు. ఇప్పటికే ఇది చాలాసార్లు ప్రూవ్ అయ్యింది.

Hero Kiran Abbavaram says injustice is being done to Telugu films
Kiran Abbavaram: తెలుగు ఆడియన్స్ కి సినిమా అంటే పిచ్చి. సినిమా బాగుంటే హీరోతో, భాషతో సంబంధం లేకుండా ఆదరించడానికి ముందుకు వస్తారు. ఇప్పటికే ఇది చాలాసార్లు ప్రూవ్ అయ్యింది. కానీ, బయట ఇండస్ట్రీలో పరిస్థితి దారుణంగా ఉంటుంది. సినిమా చూడటం విషయం పక్కన పెడితే, కనీసం విడుదల చేయడానికి కూడా సహకారం అందించారు. ఇదే విషయంపై టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఆసక్తికర కామెంట్స్ చేశాడు. (Kiran Abbavaram)నిజానికి ఆలోచింపజేసేలా ఉన్నాయి. దీంతో, టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Trivikram-Venkatesh: 20 నెలల లాంగ్ గ్యాప్.. సెట్ పైకి వచ్చిన త్రివిక్రమ్.. వెంకీ మూవీ షురూ
కిరణ్ అబ్బవరం హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కే-రాంప్. త్వరలోనే రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న కిరణ్ తన సినిమాకు తమిళనాడులో థియేటర్లు ఇవ్వము అని ముఖాన చెప్పినట్లు చెప్పుకొచ్చాడు. ఈ విషయం గురించి కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. “తమిళనాడులో తెలుగు సినిమాలకు స్క్రీన్స్ ఇవ్వడం లేదు. తమిళ హీరోలకు తెలుగులో మాత్రం కావాల్సినన్ని స్క్రీన్స్ దొరుకుతున్నాయి. ఈ వ్యత్యాసం ఎందుకు అని ఆవేదన వ్యక్తం చేశాడు. తమిళ్ హీరో ప్రదీప్ రంగనాథన్ సినిమాకి తెలుగులో థియేటర్స్ ఫుల్లుగా ఇచ్చేశారు. నేను నా క సినిమాను తమిళ్ లో రిలీజ్ చేయాలనుకుంటే థియేటర్స్ దొరకలేదు. థియేటర్స్ ఇవ్వము అని నా ముఖం మీదనే చెప్పారు” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం కిరణ్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
దీనిపై తెలుగు ఆడియన్స్ కూడా రియాక్ట్ అవుతున్నారు. మన సినిమాలకు అక్కడ వాల్యూ ఇవ్వనప్పుడు వాళ్ళ సినిమాలకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం అని అడుగుతున్నారు. ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం అంటూ కిరణ్ అబ్బవరంకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. మన సహకారం ముందు మన సినిమాలకి ఉండాలని, తరువాతే ఎవరికైనా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరి కిరణ్ అబ్బవరం కామెంట్స్ పై సినీ పెద్దలు ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూడాలి.