Trivikram-Venkatesh: 20 నెలల లాంగ్ గ్యాప్.. సెట్ పైకి వచ్చిన త్రివిక్రమ్.. వెంకీ మూవీ షురూ

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ బ్యాక్ టూ సెట్స్ వచ్చారు. గుంటూరు కారం(Trivikram-Venkatesh) సినిమా తరువాత దాదాపు 20 నెలల గ్యాప్ తరువాత ఆయన షూట్ లో అడుగుపెట్టారు. ఇటీవల విక్టరీ వెంకటేష్ తో ఒక సినిమాను స్టార్ట్ చేశారు త్రివిక్రమ్.

Trivikram-Venkatesh: 20 నెలల లాంగ్ గ్యాప్.. సెట్ పైకి వచ్చిన త్రివిక్రమ్.. వెంకీ మూవీ షురూ

Trivikram-Venkatesh's regular shooting begins

Updated On : October 8, 2025 / 6:25 PM IST

Trivikram-Venkatesh: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ బ్యాక్ టూ సెట్స్ వచ్చారు. గుంటూరు కారం సినిమా తరువాత దాదాపు 20 నెలల గ్యాప్ తరువాత ఆయన షూట్ లో అడుగుపెట్టారు. ఇటీవల విక్టరీ వెంకటేష్ తో ఒక సినిమాను స్టార్ట్ చేశారు త్రివిక్రమ్. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యింది. అక్టోబర్ 8 బుధవారం ఈ సినిమా సెట్స్ లో అడుగుపెట్టారు త్రివిక్రమ్. దీనికి సంబందించి లొకేషన్ నుంచి ఒక ఫోటోను సోషల్ మీడియాలో (Trivikram-Venkatesh)రిలీజ్ చేశారు. హీరో వెంకటేష్ తో దర్శకుడు త్రివిక్రమ్ ఉన్న ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో, త్రివిక్రమ్, వెంకటేష్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ ఫీలవుతున్నారు.

Director Jayashankar: ఉద్యోగం వదిలేసి సినిమాల్లోకి.. ‘అరి’ కోసం హిమాలయాలకు: డైరెక్టర్ జయశంకర్

ఇక వెంకటేష్-త్రివిక్రమ్ కాంబో విషయానికి వస్తే. వెంకటేష్ హీరోగా వచ్చిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలకు కథ, మాటలు అందించారు త్రివిక్రమ్. ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ రెండు సినిమాలు ఎంత పెద్ద విజయాన్ని సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆడియన్స్ ఈ సినిమాలను ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. ఇప్పటికీ ఈ సినిమాలు టీవీలో వస్తే తప్పకుండా చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళ కాంబోలో సినిమా వస్తుంది అంటే ఆ ఎగ్జైట్ మెంట్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి హైప్ ఇప్పుడు వెంకటేష్-త్రివిక్రమ్ సినిమాకు క్రియేట్ అవుతోంది.

మరోసారి నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి సినిమాల రేంజ్ లో ఆడియన్స్ ను అలరించడానికి ఈ ఇద్దరు సిద్ధం అవుతున్నారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి లేదా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించే అవకాశం ఉందని సమాచారం. ఇక సినిమా షూటింగ్ ను త్వరగా కంప్లీట్ చేసి 2026 ప్రథమార్ధంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మరి ఈ సినిమా ఆడియన్స్ ను ఏ మేరకు ఆకట్టుకుంటుంది అనేది చూడాలి.