అభిమాని మరణం – బాలయ్య భావోద్వేగం

డెంగీ కారణంగా బాల నటుడు గోకుల్ సాయికృష్ణ మరణించాడు.. గోకుల్ మరణవార్త తెలుసుకున్న నందమూరి బాలకృష్ణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు..

  • Published By: sekhar ,Published On : October 18, 2019 / 10:15 AM IST
అభిమాని మరణం – బాలయ్య భావోద్వేగం

Updated On : May 28, 2020 / 4:08 PM IST

డెంగీ కారణంగా బాల నటుడు గోకుల్ సాయికృష్ణ మరణించాడు.. గోకుల్ మరణవార్త తెలుసుకున్న నందమూరి బాలకృష్ణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు..

డెంగీ కారణంగా బాల నటుడు గోకుల్ సాయికృష్ణ మరణించిన సంగతి తెలిసిందే.. నటిసింహా నందమూరి బాలకృష్ణ వీరాభిమాని అయిన గోకుల్ బాలయ్య నటించిన చిత్రాల్లోని పలు పవర్ ఫుల్ డైలాగులు చెప్తూ నందమూరి అభిమానులను ఆకట్టుకున్నాడు. తనను నందమూరి అభిమానులు ‘జూనియర్ బాలయ్య’ అని పిలుస్తుంటారు.

బాలయ్య సైతం గోకుల్ సాయిని ప్రశంసించారు. గోకుల్ మరణవార్త తెలుసుకున్న నందమూరి బాలకృష్ణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘మాకు అభిమానుల కంటే విలువైనది మరొకటి ఉండదు. అలాంటి చిన్నారి అభిమాని గోకుల్. నేనంటే ప్రాణం ఇచ్చే ఈ చిన్నారి ఈ రోజు ప్రాణాలతో లేడన్న నిజం నా మనసును కలచివేసింది. అతడు డైలాగులు చెప్పిన విధానం.. హావభావాలు చూసి నాకు ఎంతో ముచ్చటేసేది’…..

Read Also : ‘జూనియర్ బాలయ్య’ గోకుల్ మృతి

‘ఎంతో భవిష్యత్తు ఉన్న ఈ చిన్నారి ఇంత చిన్న వయసులో డెంగ్యూ వ్యాధితో ఈ లోకాన్ని విడిచి వెళ్లడం చాలా బాధ కలిగించింది. ఈ చిన్నారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ.. అతని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’.. అంటూ బాలయ్య సోషల్ మీడియాలో భావోద్వేగపు పోస్ట్ చేశారు. గోకల్ మృతికి బాలకృష్ణ అభిమానులు సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున సంతాపం తెలుపుతున్నారు.