Waltair Veerayya: వీరయ్య కోసం వీరసింహారెడ్డి రాక.. ఫ్యాన్స్‌ను ఆపడం ఇక కష్టమే!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు బాబీ పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ సబ్జెక్టుగా తీర్చిదిద్దుతుండటంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో, మెగా ఫ్యాన్స్‌లో భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, సాంగ్స్, వీడియో గ్లింప్స్‌లు ఈ సినిమాపై ఏర్పడ్డ అంచనాలను రెట్టింపు చేశాయి.

Nandamuri Balakrishna To Be Guest For Waltair Veerayya Pre-Release Event

Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు బాబీ పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ సబ్జెక్టుగా తీర్చిదిద్దుతుండటంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో, మెగా ఫ్యాన్స్‌లో భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, సాంగ్స్, వీడియో గ్లింప్స్‌లు ఈ సినిమాపై ఏర్పడ్డ అంచనాలను రెట్టింపు చేశాయి. కాగా, ఈ సినిమాలో మెగాస్టార్‌తో పాటు మాస్ మహారాజ్ రవితేజ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తుండటంతో వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Waltair Veerayya : ‘పూనకాలు’ తెప్పించేందుకు చిరు, రవితేజ సై..

ఇక సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్‌ను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తోందట చిత్ర యూనిట్. ఇక ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా నందమూరి బాలకృష్ణను తీసుకురావాలని చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘వాల్తేరు వీరయ్య’కు పోటీగా సంక్రాంతికే బాలకృష్ణ నటిస్తున్న ‘వీరసింహారెడ్డి’ మూవీ కూడా రానుంది. అయితే ఈ రెండు సినిమాలను కూడా మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తుండటంతో వారు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Waltair Veerayya: ఈ సినిమా రొటీన్ ఎంటర్‌టైనర్.. హెడ్డింగ్ రాసిపెట్టుకోమంటున్న వీరయ్య!

మరి వాల్తేరు వీరయ్య కోసం వీరసింహారెడ్డి నిజంగానే వస్తాడా అనేది ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. ఇక ఈ రెండు సినిమాలు కూడా వైవిధ్యమైన కథలతో వస్తుండటంతో ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్లుగా నిలవాలని అభిమానులు కోరుతున్నారు. కాగా ఈ రెండు సినిమాల్లోనూ హీరోయిన్‌గా శ్రుతి హాసన్ నటిస్తుండటం మరో విశేషం.