Waltair Veerayya : ‘పూనకాలు’ తెప్పించేందుకు చిరు, రవితేజ సై..

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ్ రవితేజతో కలిసి మాస్ జాతర చేయడానికి సిద్దమవుతున్నాడు. 'వాల్తేరు వీరయ్య' మూవీ నుంచి హై వోల్టేజ్ సాంగ్ ని రిలీజ్ చేయడానికి మేకర్స్ డేట్ ఫిక్స్ చేశారు. పూనకాలు లోడింగ్ అంటూ సాగే ఈ పాటలో చిరంజీవి, రవితేజ..

Waltair Veerayya : ‘పూనకాలు’ తెప్పించేందుకు చిరు, రవితేజ సై..

Waltair Veerayya Poonakalu Loading song release date fix

Updated On : December 29, 2022 / 2:38 PM IST

Waltair Veerayya : మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ్ రవితేజతో కలిసి మాస్ జాతర చేయడానికి సిద్దమవుతున్నాడు. చిరు వింటేజ్ లుక్ లో దర్శనమిస్తూ వస్తున్న తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. ఈ మూవీలో రవితేజ ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కె బాబీ డైరెక్ట్ చేస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Waltair Veerayya: ఈ సినిమా రొటీన్ ఎంటర్‌టైనర్.. హెడ్డింగ్ రాసిపెట్టుకోమంటున్న వీరయ్య!

ఇక ఇప్పటికి ఈ మూవీ నుంచి ‘బాస్ పార్టీ’, ‘చిరంజీవి-శ్రీదేవి’, ‘వీరయ్య’ సాంగ్స్ రిలీజ్ కాగా.. చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి. ఇప్పుడు సినిమాలోని హై వోల్టేజ్ సాంగ్ ని రిలీజ్ చేయడానికి మేకర్స్ డేట్ ఫిక్స్ చేశారు. పూనకాలు లోడింగ్ అంటూ సాగే ఈ పాటలో చిరంజీవి, రవితేజ కలిసి డాన్స్ చేయబోతున్నారు. ఇద్దరు మాస్ హీరోలు కలిసి ఒక మాస్ సాంగ్ కి డాన్స్ వేస్తే, ఎలా ఉంటాదో చూడడానికి అందరూ ఎదురు చూస్తున్నారు.

న్యూ ఇయర్ కానుకగా శుక్రవారం డిసెంబర్ 30న ఈ సాంగ్ ని విడుదల చేస్తున్నట్లు ఒక పోస్టర్ ని విడుదల చేశారు. ఈ పోస్టర్ లో చిరు అండ్ రవితేజ డాన్స్ ఫోజ్ చూస్తుంటే అభిమానులకు పూనకాలు రావడం గ్యారంటీ అనిపిస్తుంది. ఈ సాంగ్ కి శేఖర్ మాస్టర్ డాన్స్ కంపోజ్ చేసినట్లు తెలుస్తుంది. గతంలో రవితేజ, చిరంజీవి శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో ఒక పాటలో అలా మెరిసిన సంగతి తెలిసిందే.