Nandamuri Kalyan Ram Devil Movie Two Days Collections Full Details Here
Devil Collections : నందమూరి కళ్యాణ్ రామ్(Nandamuri Kalyan Ram) నటించిన పీరియాడిక్ స్పై యాక్షన్ థ్రిలర్ మూవీ ‘డెవిల్’ డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకి వచ్చింది. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా, మాళవిక నాయర్ ముఖ్య పాత్రలో కనిపించారు ఈ సినిమాలో. స్వతంత్రం ముందు సుభాష్ చంద్రబోస్, అతని అనుచరులని బ్రిటిష్ వాళ్ళు పట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు, మరో వైపు ఓ హత్య కేసు ఛేదించడం.. అనే కథాంశంతో డెవిల్ సినిమా ఆద్యంతం ఆసక్తిగా సాగింది.
మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న డెవిల్ మంచి విజయం సాధించింది. డెవిల్ కి పాజిటివ్ టాక్ వస్తుండటంతో చిత్రయూనిట్ ఆల్రెడీ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంది. డెవిల్ కి మంచి కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. డెవిల్ సినిమా మొదటి రోజు 4.92 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగా, రెండో రోజు అది మరింత పెరిగి 5.50 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది.
Also Read : Ram Charan : రామ్ చరణ్‌తో ‘డంకీ’ డైరెక్టర్ మూవీ.. క్లారిటీ ఇచ్చిన రాజ్ కుమార్ హిరాణి..
మొత్తంగా డెవిల్ సినిమా రెండు రోజుల్లోనే 10.42 కోట్ల గ్రాస్ ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వారం పెద్దగా సినిమాలేమి లేకపోవడం కూడా డెవిల్ కి కలిసొచ్చి కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.
Agent #Devil packs a powerful strike at the Box Office! ?
2 days worldwide gross soars to 10.42cr ?
Historical Blockbuster #Devil In Cinemas now?
Book your tickets now! ?https://t.co/wfG49rByQ7 #DevilTheMovie@NANDAMURIKALYAN@iamsamyuktha_ #MalvikaNair
Directed &… pic.twitter.com/BYA8tRQbee— Devil The Movie (@Devil_TheMovie) December 31, 2023