Ram Charan : రామ్ చరణ్‌తో ‘డంకీ’ డైరెక్టర్ మూవీ.. క్లారిటీ ఇచ్చిన రాజ్ కుమార్ హిరాణి..

పలు బాలీవుడ్ డైరెక్టర్స్ దర్శకత్వంలో చరణ్ సినిమాలు ఉంటాయని రూమర్స్ వస్తున్నాయి.

Ram Charan : రామ్ చరణ్‌తో ‘డంకీ’ డైరెక్టర్ మూవీ.. క్లారిటీ ఇచ్చిన రాజ్ కుమార్ హిరాణి..

Ram Charan Movie under Rajkumar Hirani Direction in Bollywood Rumors Goes Viral

Updated On : December 31, 2023 / 12:05 PM IST

Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ RRR సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శంకర్(Shankar) దర్శకత్వంలో గేమ్ ఛేంజర్(Game Changer) సినిమా చేస్తున్నాడు చరణ్. గత రెండేళ్లుగా ఈ సినిమా కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇంకా ఈ సినిమా షూటింగ్ దశలోనే ఉంది. ఆ తర్వాత బుచ్చిబాబు సాన దర్శకత్వంలో కూడా సినిమాని ప్రకటించాడు చరణ్.

అయితే చరణ్ బాలీవుడ్ వెళ్తున్నాడంటూ బాలీవుడ్(Bollywood) లో కూడా సినిమాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. పలు బాలీవుడ్ డైరెక్టర్స్ దర్శకత్వంలో చరణ్ సినిమాలు ఉంటాయని రూమర్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో షారుఖ్ ఖాన్ డంకీ మూవీ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణి(Rajkumar Hirani) దర్శకత్వంలో కూడా రామ్ చరణ్ సినిమా ఉంటుందని బాలీవుడ్ లో వార్తలు వచ్చాయి. తాజాగా డంకీ సక్సెస్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూ ఇవ్వగా రాజ్ కుమార్ హిరాణి దీనిపై క్లారిటీ ఇచ్చారు.

Also Read : 2023 Small Movies : కంటెంట్ ఉంటే చాలు స్టార్స్ అక్కర్లేదు.. 2023లో సూపర్ హిట్ అయిన చిన్న సినిమాలు ఇవే..

ఇంటర్వ్యూలో యాంకర్.. మీరు రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నారని వార్తలు వచ్చాయి, నిజమేనా అని ప్రశ్నించగా దీనికి రాజ్ కుమార్ హిరాణి స్పందిస్తూ.. నేను కూడా ఈ వార్తలు చూశాను. రీసెంట్ గా పేపర్స్ లో కూడా చూశాను. నాకు రామ్ చరణ్ తెలుసు. కలిసి చాలా రోజులైంది. అతనితో సినిమా చేయడం ఇష్టమే, RRR సినిమాలో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. కానీ ప్రస్తుతానికి మా కాంబోలో సినిమా అయితే లేదు అని క్లారిటీ ఇచ్చారు. ఇక చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ షూట్ తో బిజీగా ఉన్నాడు. 2024లో ఈ సినిమా రానుంది.