Nani Sujeeth
Nani Sujeeth : ఇటీవలే డైరెక్టర్ సుజీత్ పవన్ కళ్యాణ్ తో OG లాంటి బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాని DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మించారు. ఈ సినిమా తర్వాత సుజీత్ నానితో సినిమా చేయాలి. ఈ సినిమాని గతంలోనే ప్రకటించారు. ఇది కూడా DVV ఎంటర్టైన్మెంట్స్ లోనే ప్రకటించారు. అయితే ఏమైందో తెలీదు కానీ ఈ సినిమాకు సడెన్ గా నిర్మాతలు మారారు.(Nani Sujeeth)
నేడు నాని – సుజీత్ సినిమా ఓపెనింగ్ జరిగింది. ఈ సినిమాని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలోనే నేడు పూజా కార్యక్రమాలు జరిగాయి. అలాగే నాని కూడా తన యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్ ద్వారా ఇందులో భాగమయ్యాడు. దీంతో ఫ్యాన్స్ అదేంటి DVV వాళ్ళని వదిలేసి నిర్మాతలను మార్చేశారు అని నాని – సుజీత్ లని అడుగుతున్నారు. నాని కూడా గతంలో DVV నిర్మాణ సంస్థలో సరిపోదా శనివారం సినిమా చేసి హిట్ కొట్టాడు.
Also See : Viva Harsha : దసరా స్పెషల్.. భార్యతో కలిసి కమెడియన్ వైవా హర్ష పూజలు.. ఫొటోలు..
మరి ఎందుకు నిర్మాతని మార్చేశారు అని అంతా అనుకుంటున్నారు. అయితే నాని – వెంకట్ బోయినపల్లి బాగానే క్లోజ్. దీంతో నాని వల్లే నిర్మాతలు మారారు అని టాక్. అలాగే DVV కూడా ఈ సినిమాని పాజిటివ్ దృక్పథంతోనే ఇచ్చేసిందని, వేరే సినిమాలు ఉన్నాయని, ఎలాగో OG ప్రీక్వెల్ ఉంది సుజీత్ తో అని ఇంకొంతమంది అంటున్నారు. గతంలో నాని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ లో శ్యామ్ సింగరాయ్ సినిమా తీసి హిట్ కొట్టాడు. ఆ తర్వాత వాళ్ళు వెంకటేష్ తో సైంధవ్ సినిమా తీసి లాస్ అయ్యారు. అందుకే నాని వాళ్ళ కోసం ఈ సినిమాని సెట్ చేసాడని, ఓపెనింగ్ కి కూడా వెంకటేష్ అందుకే వచ్చాడని టాక్ నడుస్తుంది.
నాని, సుజీత్ ఇద్దరికీ DVV సంస్థ హిట్స్ ఇచ్చింది. అయినా ఈ ఇద్దరూ ఇప్పుడు వేరే నిర్మాతలతో ఎందుకు సినిమా చేస్తున్నారో వాళ్ళే చెప్పాలి. ప్రమోషన్స్ టైంలో ఏమైనా చెప్తారేమో చూడాలి. ఇక ఈ సినిమాపై బాగానే అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు బ్లడీ రోమియో అనే టైటిల్ అనుకుంటున్నట్టు సుజీత్ ఇంటర్వ్యూలో తెలిపాడు. సాహో, OG తర్వాత ఇది కూడా సుజీత్ సినిమాటిక్ యూనివర్స్ లో ఉంటుందా లేదా చూడాలి.
గతంలో DVV సంస్థలో సినిమా అనౌన్స్ చేసిన వీడియో..
Also See : Swetha Naidu : ఫ్రెండ్స్ తో శ్వేతా నాయుడు బర్త్ డే సెలబ్రేషన్స్.. హాట్ ఫోజులతో.. ఫొటోలు వైరల్..
నేడు సినిమా ఓపెనింగ్ లో నిర్మాత వెంకట్ బోయనపల్లితో..