Nani Gang Leader Actress Shriya Kontham Turned As Heroine with 14 Days Girlfriend Intlo Trailer Released
Shriya Kontham : గ్యాంగ్ లీడర్ సినిమాలో నాని ని అన్నయ్య అని పిలిచిన అమ్మాయి శ్రియ కొంతం గుర్తుందా? ఆ సినిమాలో కీలక పాత్ర పోషించి ఆ తర్వాత చదువుకోడానికి విదేశాలకు వెళ్ళిపోయింది. గ్యాంగ్ లీడర్ తర్వాత సినిమాల్లో కనపడక పోయినా సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా బోల్డ్ ఫోటోలు పోస్ట్ చేస్తూ అలరిస్తుంది శ్రియ కొంతం. ఇప్పుడు ఈ భామ హీరోయిన్ గా మారి సినిమాతో ఎంట్రీ ఇస్తుంది.
అంకిత్ కొయ్య, శ్రియ కొంతం జంటగా సత్య ఆర్ట్స్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సత్య కోమల్ నిర్మాణంలో శ్రీ హర్ష మన్నె దర్శకత్వం తెరకెక్కుతున్న సినిమా ’14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో’. వెన్నెల కిషోర్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా తాజాగా నేడు దర్శకుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ చేసారు.
Also Read : Manchu Vishnu : ఇంత మంచోడివి ఏంటి భయ్యా.. ఎంత నెగిటివిటీ చూపించినా పాజిటివ్ గా మంచు విష్ణు.. ట్వీట్ వైరల్..
14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో ట్రైలర్ మీరు కూడా చూసేయండి..
Also Read : Kannappa Teaser 2 : మంచు విష్ణు ‘కన్నప్ప’ నుంచి మరో టీజర్.. అదిరిపోయిన ప్రభాస్ ఎంట్రీ..
ఇక ఈ ట్రైలర్ చూస్తే ఇంట్లో ఎవరూ లేరని గర్ల్ ఫ్రెండ్ ను కలవడానికి వెళ్లిన కుర్రాడు అనుకోకుండా అదే ఇంట్లో 14 రోజులు ఉండాల్సి వస్తే ఏం జరిగింది, అమ్మాయి తల్లిదండ్రులకు, తాతకు ఈ విషయాన్ని తెలియకుండా హీరోయిన్ ఎలాంటి కష్టాలు పడింది అని కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాని మార్చి 7న థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు.