Nani Hi Nanna Movie Collections Announced Officially by Movie Unit
Hi Nanna Collections : నాని(Nani), మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) జంటగా నటించిన హాయ్ నాన్న ఇటీవల డిసెంబర్ 7న థియేటర్స్ లోకి వచ్చి ప్రేక్షకులని మెప్పించింది. ఫాదర్ సెంటిమెంట్ తో పాటు లవ్ ఎమోషన్ కూడా ఉండటం, మధ్యలో ఓ ట్విస్ట్.. ఇలా సినిమా ఆద్యంతం ప్రేక్షకులని అలరించింది. సినిమాలో ఉన్న మెలోడీ సాంగ్స్ కూడా మెప్పించాయి. మొదటి ఆట నుంచే హాయ్ నాన్న సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
అయితే హాయ్ నాన్న సినిమాకు మంచి కలెక్షన్స్ కూడా వస్తున్నట్టు చెప్పారు కానీ అధికారికంగా చిత్రయూనిట్ కలెక్షన్స్ బయటపెట్టలేదు. కేవలం అమెరికా కలెక్షన్స్ మాత్రం రెగ్యులర్ గా పోస్ట్ చేసారు. హాయ్ నాన్న సినిమా అమెరికాలో 2 మిలియన్ డాలర్స్ పైగా కలెక్ట్ చేసి అక్కడ కూడా హిట్ అందుకుంది. తాజాగా చిత్రయూనిట్ హాయ్ నాన్న సినిమా కలెక్షన్స్ ని అధికారికంగా ప్రకటించారు. హాయ్ నాన్న సినిమా డిసెంబర్ 30 వరకు 75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలుచేసినట్టు ప్రకటించారు.
Also Read : Sarkaaru Noukari : ‘సర్కారు నౌకరి’ మూవీ రివ్యూ.. సింగర్ సునీత కొడుకు ఫస్ట్ సినిమా ఎలా ఉందంటే..?
ఈ సినిమాని 35 కోట్లతో తెరకెక్కించినట్టు సమాచారం. ఇప్పుడు 75 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇంకా ఈ సినిమా థియేటర్స్ లో ఆడుతుంది. దీంతో నాని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నాని గత సినిమా దసరా 100 కోట్లకు పైగా సాధించి భారీ హిట్ కొట్టగా ఇప్పుడు హాయ్ నాన్న కూడా 75 కోట్లు కలెక్ట్ చేసి మంచి విజయం సాధించింది. ఇక హాయ్ నాన్న సినిమా నెట్ ఫ్లిక్స్ లో జనవరి 4 నుంచి స్ట్రీమింగ్ అవ్వనుంది.
Ending the year on a BLOCKBUSTER NOTE ??
Thank you all for embracing good cinema and giving us a warm hug ?#HiNanna magic has made a 75Crore+ Worldwide Gross ❤️? and this is our victory ?#BlockbusterNanna
Natural ? @NameIsNani @Mrunal0801 @PriyadarshiPN @shouryuv… pic.twitter.com/Ywl7pFPAEz
— Vyra Entertainments (@VyraEnts) December 31, 2023