Nani HIT 3 Movie Three Days World Wide Collections
Hit 3 Collections : థియేటర్స్ కి జనాలే రావట్లేదని అందరూ బాధపడుతుంటే నాని మాత్రం తన సినిమాలతో థియేటర్స్ హౌస్ ఫుల్ చేస్తున్నాడు. ఓ పక్క హీరోగా, మరో పక్క నిర్మాతగా నాని సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నాడు. నాని హీరోగా తెరకెక్కిన హిట్ 3 సినిమా ఇటీవల మే 1న రిలీజయి మంచి హిట్ టాక్ తెచ్చుకుంది.
హిట్ 3 సినిమా మొదటి రోజే 40 కోట్లకు పైగా వసూలు చేసి నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ గా నిలిచింది. మూడు రోజుల్లో ఈ సినిమా ఏకంగా 82 కోట్ల గ్రాస్ వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. మూవీ యూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
నేడు ఆదివారం కాబట్టి రేపటికల్లా 100 కోట్ల గ్రాస్ ఈజీగా కలెక్ట్ చేస్తుందని తెలుస్తుంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఆల్మోస్ట్ 90 కోట్ల గ్రాస్ సాధించాలి. ఈజీగా ఇవాళ బ్రేక్ ఈవెన్ అయి రేపట్నుంచి ప్రాఫిట్స్ తో దూసుకుపోతుంది హిట్ 3 సినిమా. ఇక అమెరికాలో కూడా ఈ సినిమా ఆల్మోస్ట్ 2 మిలియన్ డాలర్స్ పైగా కలెక్ట్ చేసింది.