hit 3 trailer
నాచురల్ స్టార్ నాని నటిస్తున్న మూవీ హిట్-3. శైలష్ కొలను దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. హిట్ ఫ్రాంఛైజీలో వస్తున్న మూడో చిత్రం కావడంతో ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తోండగా మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. నాని హోం బ్యానర్ వాల్‌పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్ పై ప్రశాంతి త్రిపురనేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మే 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది.
Anupama Parameswaran-Dhruv vikram : స్టార్ హీరో కొడుకుతో అనుపమ ప్రేమాయణం..! ప్రైవేట్ ఫోటో లీక్..!
వరుస హత్యలు, అర్జున్ వాటిని ఎలా చేధించాడు అనే కోణంలో ఈ సినిమా ఉండనున్నట్లు ట్రైలర్ బట్టి తెలుస్తోంది. అర్జున్ సర్కార్‌గా నాని చెప్పిన డైలాగ్‌లు అదిరిపోయాయి. మొత్తంగా ట్రైలర్ అదిరిపోయింది. సినిమాల పై ఉన్న అంచనాలను అమాంతం పెంచేసింది.