Nani : నాని సినిమాలు లాభాలు తెచ్చిపెట్టడం లేదు.. నిర్మాత రిప్లై ట్వీట్ వైరల్..

నాని సినిమాలు లాభాలు తెచ్చిపెట్టడం లేదు.. నాగవంశీ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

Nani movies are not profitable producer nagavamsi reaction tweet

Nani : నేచురల్ స్టార్ నాని ఈ ఏడాది ‘దసరా’ సినిమాతో సూపర్ హిట్టుని అందుకున్నాడు. ఇప్పుడు ‘హాయ్ నాన్న’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్దమయ్యాడు. నేడు ఈ మూవీ టీజర్ ని మీడియా విలేకర్ల ముందు గ్రాండ్ గా రిలీజ్ చేశాడు. అనంతరం మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించాడు. ఇక ఈ ఇంటరాక్షన్ ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు నాని ఇచ్చిన సమాధానం, దాని పై రియాక్ట్ అవుతూ నిర్మాత నాగవంశీ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటి..? దానికి జవాబు ఏంటి..? దానిపై రియాక్షన్ ఏంటి..?

విలేకరి అడిగిన ప్రశ్న.. “మీరు జెర్సీ, శ్యామ్ సింగ్ రాయ్, హాయ్ నాన్న వంటి మంచి సినిమాలను సెలెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఆ చిత్రాలు నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టడం లేదని టాక్ వినిపిస్తుంది. ఈక్రమంలోనే మీ జెర్సీ సినిమా కమర్షియల్ గా వర్క్ అవుట్ అవ్వలేదని కామెంట్స్ వినిపించాయి” అని అడిగాడు. దీని నాని బదులిస్తూ.. “ప్రొడ్యూసర్స్ అన్ని లెక్కలు బయటకి చెప్పారు కదా సార్. జెర్సీ 10కి 50 రూపాయిలు తెచ్చిపెట్టింది” అంటూ పేర్కొన్నాడు.

Also read : Hi Nanna : మరోసారి లిప్‌కిస్‌లతో రెచ్చిపోయిన నాని.. మృణాల్ ఠాకూర్‌తో.. 

ఇక దీని పై జెర్సీ మూవీ నిర్మాత నాగవంశీ రియాక్ట్ అవుతూ.. “సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో మంచి లాభాలు, అలాగే మంచి జ్ఞాపకాలు మిగిలిచిన సినిమాల్లో జెర్సీ కూడా ఒకటి. అలాగే ఈ సినిమా జాతీయ అవార్డులను అందుకొని దేశవ్యాప్తంగా గుర్తింపుని సంపాదించుకుంది. ఒక ప్రొడ్యూసర్ గా ఈ సినిమా విషయంలో.. నేను ఆర్ధికంగా, క్రియేటివ్ పరంగా చాలా సంతోషం అనుభవించాను” అని ట్వీట్ చేసి నానికి సపోర్ట్ చేస్తూనే విలేకరికి కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చాడు. ఇక ఇతర నిర్మాతలు కూడా ఈ విషయం పై రియాక్ట్ అవుతూ ట్వీట్ చేస్తున్నారు.