Hi Nanna : మరోసారి లిప్‌కిస్‌లతో రెచ్చిపోయిన నాని.. మృణాల్ ఠాకూర్‌తో..
హాయ్ నాన్న ప్రమోషన్స్ మొదలు పెట్టిన చిత్ర యూనిట్ సాంగ్స్ రిలీజ్ చేస్తూ వస్తున్నారు. తాజాగా మూవీ టీజర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు.

Nani and Mrunal Thakur lip kiss in Hi Nanna teaser highlighted
Hi Nanna : నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘హాయ్ నాన్న’. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో రాబోతున్న ఈ మూవీని కొత్త దర్శకుడు శౌర్యువ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టిన చిత్ర యూనిట్ సాంగ్స్ అండ్ టీజర్ రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఈక్రమంలోనే మూవీ నుంచి రెండు సాంగ్స్ ని రిలీజ్ చేసిన మేకర్స్.. ఇప్పుడు టీజర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. ఇక టీజర్ లో నాని, మృణాల్ ఠాకూర్‌తో లిప్‌కిస్‌లతో రెచ్చిపోయాడు.
గతంలో శ్యామ్ సింగ్ రాయ్ సినిమాలో కృతిశెట్టితో ఘాటు లిప్ లాక్ రొమాన్స్ తో రెచ్చిపోయిన నాని.. ఇప్పుడు మరోసారి హాయ్ నాన్న సినిమాలో లిప్ లాక్ సీన్స్ తో కనిపించబోతున్నాడు. ఈ మూవీ టైటిల్ చూసి ‘జెర్సీ’లా ఫాదర్ సెంటిమెంట్ తో వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ టీజర్ లో ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్ కంటే.. హీరోహీరోయిన్ మధ్య ప్రేమ, రొమాన్స్ నే ఎక్కువ చూపించారు. మరి మూవీ అంతా కూడా ఇలానే లవ్ స్టోరీ ఉంటుందా..? లేదా ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ కూడా కనిపిస్తుందా..? అనేది చూడాలి.
Also read : Captain Miller : సలార్, దేవరని ఫాలో అవుతున్న కెప్టెన్ మిల్లర్.. ఏ విషయంలో తెలుసా..?
ఇక ఈ మూవీ రిలీజ్ డేట్ పై కొంచెం సందేహం నెలకుంది. క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 21న ఆడియన్స్ ముందుకు ఈ చిత్రాన్ని తీసుకు వస్తామంటూ మేకర్స్ గతంలో ప్రకటించారు. అయితే ఆ సమయానికి ప్రభాస్ ‘సలార్’ వస్తుండడంతో.. పోస్టుపోన్ లేదా ప్రీపోన్ అవ్వబోతుందంటూ వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు రిలీజ్ చేసిన ఈ టీజర్‌తో.. కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. డిసెంబర్ 7న ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.