Hi Nanna : హాయ్ నాన్న నుంచి ‘అమ్మాడి’ సాంగ్ ప్రోమో రిలీజ్..

హాయ్ నాన్న సినిమా నుంచి 'అమ్మాడి' సాంగ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. నాని, మృణాల్ మధ్య లవ్ స్టోరీతో..

Hi Nanna : హాయ్ నాన్న నుంచి ‘అమ్మాడి’ సాంగ్ ప్రోమో రిలీజ్..

Nani Mrunal Thakur Hi Nanna Ammaadi Song Promo released

Updated On : November 1, 2023 / 6:18 PM IST

Hi Nanna : నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ కలిసి నటిస్తున్న సినిమా ‘హాయ్ నాన్న’. కొత్త దర్శకుడు శౌర్యువ్‌ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ అని చెప్పినప్పటికీ.. రిలీజ్ చేస్తున్న సాంగ్స్, టీజర్ చూస్తుంటే ప్యూర్ లవ్ స్టోరీలా కనిపిస్తుంది. ఈ మూవీ నుంచి ఇప్పటికి రెండు సాంగ్స్ రిలీజ్ చేశారు. మొదటి సాంగ్ లో మృణాల్ తో లవ్ డ్యూటీ పాడిన నాని, సెకండ్ సాంగ్ లో నాన్నగా కూతురి మీద ప్రేమని చూపించాడు. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు మృణాల్ అంటున్నాడు. తాజాగా మూడో పాట ప్రోమోని రిలీజ్ చేశారు.

‘అమ్మాడి’ అని సాగే ఈ పాట నాని అండ్ మృణాల్ మధ్య సాగనుంది. ప్రోమో చూడడానికి ఆకట్టుకుంటుంది. ఫుల్ సాంగ్ ని నవంబర్ 4న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. తెలుగుతో పాటు తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఈ సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నారు. హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని ఈ పాటని కాల భైరవ, శక్తిశ్రీ గోపాలన్ పాడారు. కృష్ణ కాంత్ లిరిక్స్ అందించాడు. మొదటి రెండు పాటలు మెలోడీతో ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. ఈ పాట కూడా ఇప్పుడు హిట్ లిస్ట్ లోకి వెళ్ళబోతున్నట్లు తెలుస్తుంది.

Also read : Chiranjeevi : మెగా 156 టైటిల్ ఫిక్స్.. లీకైన స్క్రిప్ట్ పేపర్ ఫోటో.. టైటిల్ ఏంటో తెలుసా..?

కాగా ఈ సినిమాని డిసెంబర్ 7న ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలు పెట్టి వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. ఇది ఇలా ఉంటే, ఇటీవల రిలీజ్ అయిన టీజర్ చూసిన కొందరు సినీ ప్రేమికులు.. ఈ మూవీ తమిళ్ హిట్ మూవీ ‘దాదా’కి రీమేక్ లా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రిలీజ్ చేసిన పోస్టర్స్ అండ్ టీజర్ చూస్తుంటే దాదా చిత్రంలానే ఉంది అంటున్నారు. మరి రిలీజ్ అయ్యే వరకు చూడాలి.