Nani – Pawan Kalyan : పవన్ కళ్యాణ్ సినిమా పూర్తయితేనే నా సినిమా.. పాపం పవన్ సినిమాకు నాని సినిమాకి లింక్ పడిందిగా..

నాని సినిమాకు - పవన్ కళ్యాణ్ సినిమాకి లింక్ ఏంటి అనుకుంటున్నారా?

Nani Said his upcoming Movie Link with Pawan Kalyan

Nani – Pawan Kalyan : పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉండటంతో తన చేతిలో ఉన్న సినిమాలకు కూడా డేట్స్ ఇవ్వలేకపోతున్నారు. ఈ క్రమంలో హరిహర వీరమల్లు, OG సినిమాలు పవన్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నాయి. ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమాలు పవన్ డేట్స్ లేక షూటింగ్ అవ్వక వాయిదాలు పడుతూ వస్తున్నాయి. అయితే పవన్ సినిమాకి నాని సినిమాకి లింక్ ఉందట. పవన్ కళ్యాణ్ సినిమా పూర్తయితే తప్ప నాని సినిమా మొదలవ్వదట. నాని స్వయంగా ఈ విషయం తెలిపాడు.

నాని సినిమాకు – పవన్ కళ్యాణ్ సినిమాకి లింక్ ఏంటి అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సుజీత్ దర్శకత్వంలో OG సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అదే నిర్మాణ సంస్థ సుజీత్ దర్శకత్వంలో నానితో సినిమా ప్రకటించింది. నాని సినిమా మొదలుపెట్టాలంటే సుజీత్ – పవన్ కళ్యాణ్ OG సినిమా పూర్తవ్వాలి.

Also Read : Nani : మేము టెర్రరిస్టులం కాదు కదా.. ఎందుకు అలా చేస్తున్నారు.. ఆ ఇష్యూ పై నాని కామెంట్స్..

తాజాగా హిట్ 3 ప్రమోషన్స్ లో నాని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్యారడైజ్ సినిమా చేస్తున్నాను. అది అయిన తర్వాత సుజీత్ సినిమా చేయాలి. కానీ సుజీత్ ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి సినిమా పూర్తి చేయాలి. OG అయిన తర్వాతే సుజీత్ తో నా సినిమా మొదలవుతుంది అని తెలిపారు. సో నాని – సుజీత్ సినిమా మొదలవ్వాలంటే పవన్ కళ్యాణ్ OG పూర్తయి రిలీజ్ అవ్వాలి. అది జరగాలి అంటే పవన్ డేట్స్ ఇవ్వాలి. మొత్తానికి నాని సినిమా కూడా పవన్ మీద ఆధారపడి ఉంది.

Also Read : Vijayashanthi : ఇప్పటి సినిమాల్లో హీరోయిన్స్ పాత్రలపై విజయశాంతి కామెంట్స్.. రెండు సాంగ్స్.. రెండు సీన్స్ పాపం అంటూ..