Nani : హీరో నాని అక్క బావని చూశారా? ఫస్ టైం సినిమా ఈవెంట్ కి.. నాని ఏమన్నాడంటే..

హిట్ 3 సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించగా ఈ ఈవెంట్ కి నాని అక్క, బావ కూడా వచ్చారు.

Nani Sister Deepthi and Brother in Law attends to Hit 3 Success Celebrations

Nani : ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమకు వచ్చి స్టార్ హీరోగా ఎదిగాడు నాని. ఇప్పుడు హీరోగానే కాక నిర్మాతగా కూడా సక్సెస్ లు కొడుతున్నాడు. నాని ఇటీవల హిట్ 3 సినిమాతో వచ్చి భారీ విజయం సాధించాడు. హిట్ 3 సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించగా ఈ ఈవెంట్ కి నాని అక్క, బావ కూడా వచ్చారు.

నాని అక్క దీప్తి అందరికి పరిచయమే. దీప్తి నాని నిర్మాణ సంస్థలో భాగమయి పనిచేస్తుంది. అలాగే గతంలో డైరెక్టర్ గా మీట్ క్యూట్ అనే వెబ్ సిరీస్ కూడా తీసింది. అయితే నాని బావ, దీప్తి భర్త మాత్రం ఇప్పటివరకు ఎక్కడా కనపడలేదు. నాని బావ అమెరికాలో ఉంటారు. దీప్తి కూడా కొన్నాళ్ల క్రితం వరకు అమెరికాలోనే ఉండేది. ఇటీవల నాని నిర్మాతగా బిజీ అయ్యాక ఇక్కడికి వచ్చి అప్పుడప్పుడు అమెరికా వెళ్లి వస్తుంది.

Also Read : Sivaji Raja – Pawan Kalyan : పవన్ కళ్యాణ్ పై శివాజీ రాజా ఆసక్తికర కామెంట్స్.. పూలపాన్పు నుంచి బురదలోకి వెళ్లి..

అయితే ఇటీవల నాని వాళ్ళ బావ హిట్ 3 సక్సెస్ సెలబ్రేషన్స్ కి హాజరయ్యారు. స్టేజిపై నాని మాట్లాడుతూ.. మా బావ మొదటిసారి ఓ సినిమా ఈవెంట్ కి వచ్చారు. నా సినిమాలకు ఆయనే ఫస్ట్ ప్రేక్షకుడు. అమెరికాలో సినిమా చూసి చెప్తారు. ఇవాళ ఆయన రావడం ఆనందంగా ఉంది అని అన్నాడు. దీంతో నాని వాళ్ళ అక్క బావ ఫొటో వైరల్ గా మారింది. దీప్తి గతంలో పలుమార్లు తన భర్త, పిల్లలతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Also Read : Nani – Sudeep : కిచ్చ సుదీప్ కూతురు శాన్వి.. నాని హిట్ 3 సినిమాకు పనిచేసిందని తెలుసా? సుదీప్ – నాని ఇంత క్లోజా?