Sivaji Raja – Pawan Kalyan : పవన్ కళ్యాణ్ పై శివాజీ రాజా ఆసక్తికర కామెంట్స్.. పూలపాన్పు నుంచి బురదలోకి వెళ్లి..

తాజాగా సీనియర్ నటుడు శివాజీరాజా ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Sivaji Raja – Pawan Kalyan : పవన్ కళ్యాణ్ పై శివాజీ రాజా ఆసక్తికర కామెంట్స్.. పూలపాన్పు నుంచి బురదలోకి వెళ్లి..

Sivaji Raja Interesting Comments on Pawan Kalyan goes Viral

Updated On : May 13, 2025 / 3:38 PM IST

Sivaji Raja – Pawan Kalyan : టాలీవుడ్ లో స్టార్ హీరో హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ ప్రజల కోసం ఇవన్నీ వదులుకొని రాజకీయాల్లోకి వెళ్లి పదేళ్లు కష్టపడి ఇప్పుడు సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. బయట జనాల్లోనే కాదు సినీ పరిశ్రమలో కూడా పవన్ కళ్యాణ్ కి చాలా మంది అభిమానులు ఉన్నారు. పవన్ అంటే చాలా మందికి ఇష్టం.

తాజాగా సీనియర్ నటుడు శివాజీరాజా ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Also Read : Nani – Sudeep : కిచ్చ సుదీప్ కూతురు శాన్వి.. నాని హిట్ 3 సినిమాకు పనిచేసిందని తెలుసా? సుదీప్ – నాని ఇంత క్లోజా?

ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ప్రస్తావన రాగా శివాజీరాజా మాట్లాడుతూ.. ఆయన పడ్డ కష్టానికి ఇవాళ సక్సెస్ అయ్యాడు. అతను పూలపాన్పు నుంచి బురదల్లోకి వెళ్లి అక్కడ తిరిగి తిరిగి ఈ స్థాయికి వచ్చాడు. సినిమాకి కోట్లు తీసుకుంటాడు కానీ అవన్నీ వదిలేసి వెళ్ళాడు. ఒకదాన్ని పట్టుకుంటే వదల్లేదు అతను. ఎవరెన్ని మాటలు అన్నా, ఎవరు ఎన్ని చేసినా అతను వదల్లేదు. మొన్న వాళ్ళ అబ్బాయికి అలా అయిందని తెలిసి మేము అల్లాడిపోయాం అని అన్నారు.

Also Read : Sivaji Raja – Krishnam Raju : శివాజీరాజాను బీజేపీలో జాయిన్ చేసిన కృష్ణంరాజు.. ఇవాళ్టికి నేను అదే పార్టీ.. వేరే పార్టీలో అవకాశాలు వచ్చినా..