Saripodhaa Sanivaaram : దసరా తర్వాత మరో వంద కోట్లు సాధించిన నాని.. లెక్క సరిపోయింది..

నాని ఇటీవల 'సరిపోదా శనివారం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ కొట్టాడు.

Nani SJ Suryah Saripodhaa Sanivaaram Movie Collects 100 Crores Gross

Saripodhaa Sanivaaram : ప్రస్తుతం టాలీవుడ్ లో నాని హవా నడుస్తుంది. ఓ పక్క వరుస సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేస్తున్నారు. మరో పక్క రిలీజ్ అయిన ప్రతి సినిమా ప్రేక్షకులని మెప్పిస్తుంది. ఇంకో పక్క నాని సినిమాలకు అవార్డుల వర్షం కురుస్తుంది. దీంతో నాని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఫ్యాన్స్ కి మరో గుడ్ న్యూస్ చెప్పారు.

Also Read : Megha Akash Wedding : ఘనంగా పెళ్లి చేసుకున్న హీరోయిన్.. ఫొటోలు వైరల్..

నాని ఇటీవల ‘సరిపోదా శనివారం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ కొట్టాడు. కలెక్షన్స్ కూడా భారీగా వచ్చాయి ఈ సినిమాకు. ఈ సినిమాలో SJ సూర్య విలనిజంతో అదరగొట్టాడు. తాజాగా నాని సరిపోదా శనివారం సినిమా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ విషయాన్ని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. బాక్సాఫీస్ శివ తాండవం అంటూ 100 కోట్ల స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్.

నాని ఇటీవలే దసరా సినిమాతో 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసాడు. ఆ తర్వాత హాయ్ నాన్న సినిమా 80 కోట్లు వసూలు చేసి కొద్దిలో మిస్ అయిపొయింది 100 కోట్ల టార్గెట్. ఇప్పుడు మళ్ళీ సరిపోదా శనివారం సినిమాతో మరోసారి 100 కోట్ల టార్గెట్ సాధించాడు నాని. ఇక నెక్స్ట్ వచ్చే హిట్ 3 సినిమా కూడా 100 కోట్లకు పైగా సాధిస్తుందని ఫ్యాన్స్ అంచనాలు పెంచుకుంటున్నారు.