Saripodhaa Sanivaaram : హిట్ అయి 100 కోట్లు సాధించి కూడా.. నెల లోపే ఓటీటీలోకి సరిపోదా శనివారం.. ఫ్యాన్స్ విమర్శలు..

తాజాగా సరిపోదా శనివారం సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ని ప్రకటించారు.

Nani SJ Suryah Saripodhaa Sanivaaram Movie Release Date Announced

Saripodhaa Sanivaaram : ఇటీవల నాని సరిపోదా శనివారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని, ప్రియాంక మోహన్ జంటగా SJ సూర్య నెగిటివ్ రోల్ లో తెరకెక్కిన సరిపోదా శనివారం సినిమా ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు వచ్చి థియేటర్స్ లో మంచి విజయం సాధించింది. ఈ సినిమా థియేటర్స్ లో ఇప్పటికే 100 కోట్ల కలెక్షన్స్ సాధించింది.

Also See : వెంకిమామ సెట్స్ లో బాలయ్య బాబు కామెడీ చూశారా..? వైరల్ అవుతున్న వీడియో..

అయితే తాజాగా సరిపోదా శనివారం సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ని ప్రకటించారు. సెప్టెంబర్ 26న సరిపోదా శనివారం సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలోకి రానుందని అధికారికంగా ప్రకటించారు. అయితే దీనిపై ఫ్యాన్స్, పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు చేస్తున్నారు.

రిలీజయిన నెల రోజుల లోపే ఓటీటీకి ఎందుకు, పెద్ద హిట్ అయినా కూడా ఇంత తొందరగా ఎందుకు ఓటీటీకి, ఈ మాత్రం దానికి ఆ రేంజ్ ప్రమోషన్స్ ఎందుకు? పెద్ద హీరోల సినిమాలు కూడా నెల లోపే ఓటీటీకి వస్తే ఇంక థియేటర్స్ కి ఎవరు వెళ్తారు? కనీసం ఓటీటీ రిలీజ్ డేట్ రిలీజ్ కి ఒక రోజు ముందు ప్రకటించాల్సింది.. అంటూ ఫ్యాన్స్ విమర్శలు చేస్తున్నారు. ఓటీటీలో ఇంత తొందరగా రిలీజ్ చేస్తూ థియేటర్స్ కి ఎవ్వరూ రావట్లేదు అని మీరే అంటారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక థియేటర్స్ లో మిస్ అయిన వాళ్ళు మాత్రం హమ్మయ్య ఓటీటీలోకి వచ్చేస్తుంది ఓటీటీలోకి వచ్చాకే చూస్తామని అంటున్నారు.