Nani : పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి 14 ఏళ్ళు పట్టింది..

ఈ ఈవెంట్ లో హీరో నాని మాట్లాడుతూ.. ''పవన్ గారు రావడం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇంతకంటే గొప్పగా ఉండదు. మరి కాసేపట్లో షోలు పడుతున్నాయి. ఇప్పుడు ఈవెంట్ జరుగుతుంటే...............

Nani : పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి 14 ఏళ్ళు పట్టింది..

Nani

Updated On : June 9, 2022 / 10:36 PM IST

Nani :  నాని, నజ్రియా జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ‘అంటే సుందరానికి’. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులని బాగా అలరించాయి. ఈ సినిమాని ఫుల్ లెంగ్త్ కామెడీ లవ్ ఎంటర్టైనర్ గా జూన్ 10న ప్రేక్షకుల ముందుకి రానుంది. తాజాగా ‘అంటే సుందరానికి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జూన్ 9 గురువారం సాయంత్రం హైదరాబాద్ శిల్పకళావేదికలో జరగగా ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా విచ్చేశారు.

Director Vivek : తొలిప్రేమ సినిమా టీవిలో వేస్తే రోడ్లన్నీ ఖాళీ..

ఈ ఈవెంట్ లో హీరో నాని మాట్లాడుతూ.. ”పవన్ గారు రావడం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇంతకంటే గొప్పగా ఉండదు. మరి కాసేపట్లో షోలు పడుతున్నాయి. ఇప్పుడు ఈవెంట్ జరుగుతుంటే బాగుంది. ఈ రోజు సినిమా ఇండస్ట్రీకి వచ్చాక అందరి హీరోలని కలిశాను. కానీ పవన్ గారిని కలవడానికి 14 ఏళ్ళు పట్టింది. ఇవాళ వచ్చినందుకు చాలా థ్యాంక్ యు సర్. పవన్ గారికి నా చిన్నప్పుడు నుంచి కనెక్ట్ అయ్యాను. సినిమాకి పని చేసిన వాళ్లందరికీ థ్యాంక్ యు. ఈ సినిమాకి చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. రేపు థియేటర్లలో గెలుస్తాం. అంటే సుందరానికి ఎంటెర్టాన్మెంట్ మాత్రమే కాదు ఎంజాయ్మెంట్” అని తెలిపారు.