Nani : రెండున్నర గంటల సినిమా మల్టీప్లెక్స్‌లో నిల్చొని చూసిన ‘నాని’.. ప్రతి సినిమాకు అంతే.. ఎందుకో తెలుసా?

నాని నిర్మాణంలో ప్రియదర్శి హీరోగా కొత్త డైరెక్టర్ రామ్ జగదీశ్ దర్శకత్వంలో తెరకెక్కిన కోర్ట్ సినిమా మార్చ్ 14 రిలీజయింది.

Nani watches every one of his movies standing in the theater Court Movie premiere Photo goes Viral

Nani : ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి కష్టపడి ఎదిగిన హీరోలలో నాని ఒకరు. అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు స్టార్ హీరోగా, నిర్మాతగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. నాని కొత్త ట్యాలెంట్ ని బాగా ఎంకరేజ్ చేస్తాడు. నాని నిర్మాణంలో ప్రియదర్శి హీరోగా కొత్త డైరెక్టర్ రామ్ జగదీశ్ దర్శకత్వంలో తెరకెక్కిన కోర్ట్ సినిమా మార్చ్ 14 రిలీజయింది.

ఈ సినిమాకు రెండు రోజుల ముందు నుంచే ప్రీమియర్లు వేశారు. కోర్ట్ సినిమాకు ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. మొదటి రోజు, ప్రీమియర్స్ కలుపుకొని కోర్ట్ సినిమా 8.10 కోట్ల గ్రాస్ వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అయితే కోర్ట్ సినిమా ఓ ప్రీమియర్ షో హైదరాబాద్ లోని AMB మాల్ లో వేశారు. ఆ రోజు నాని కోర్ట్ సినిమా నడుస్తున్నంతసేపు థియేటర్లో వెనక నిల్చొనే చూసాడు. దాదాపు రెండున్నర గంటలు నాని నిల్చొనే సినిమా చూసాడు. నానితో పాటు హీరో ప్రియదర్శి కూడా నిల్చున్నాడు.

Also See : Pavani Karanam : పుష్ప ఫేమ్ పావని హోలీ సెలబ్రేషన్స్ ఫొటోలు..

ఈ ఫోటో, ఈ విషయం వైరల్ గా మారాయి. ప్రీమియర్ షోకి, మల్టీప్లెక్స్ లో ఎందుకు అంత సేపు నిల్చొని చూడటం అని కొంతమంది భావిస్తున్నా దీనిపై గతంలోనే దర్శకుడు శివ నిర్వాణ క్లారిటీ ఇచ్చాడు. నాని తను ప్రొడ్యూస్ చేసిన సినిమా, తను హీరోగా చేసిన సినిమా ప్రతిదీ మొదటి షో థియేటర్లో నిల్చొనే చూస్తాడు. సినిమా ఎంతసేపు ఉంటే అంతసేపు నాని నిల్చొనే సినిమా చూస్తాడు.

Also Read : Naga Chaitanya – Sobhita : అక్కడ శోభితకు కార్ రేసింగ్ నేర్పిస్తున్న నాగ చైతన్య.. కపుల్ గోల్స్.. ఫొటోలు వైరల్..

గతంలో డైరెక్టర్ శివ నిర్వాణ టక్ జగదీశ్ సినిమా ప్రమోషన్స్ లో దీని గురించి మాట్లాడుతూ.. ఎంతమంది కూర్చోమని అడిగినా మొదటి షో నాని నిల్చొనే చూస్తాడు. సినిమాలో వచ్చే సీన్స్ కి ప్రేక్షకులు ఎలా ఫీల్ అవుతున్నారు, ఏ సీన్ కి ప్రేక్షకులు ఎలాంటి మూమెంట్స్ ఇస్తున్నారు అని ప్రతిదీ చూస్తారు. సినిమాని ఆడియన్స్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అని చూసి తెలుసుకుంటారు. ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి నాని ఆనందిస్తారు. ప్రేక్షకులు సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు తెలుసుకోవడానికే నాని నిల్చొని సినిమా చూస్తాడు అని తెలిపాడు. ఈ విషయం ఇప్పుడు కోర్ట్ సినిమాతో మరోసారి వైరల్ అవ్వడంతో అంతా నాని పై అభినందనలు కురిపిస్తున్నారు. ఇక నాని త్వరలో హిట్ 3 సినిమాతో రాబోతున్నాడు. ఆ తర్వాత ది పారడైజ్ సినిమా చేస్తున్నాడు.