Naga Chaitanya – Sobhita : అక్కడ శోభితకు కార్ రేసింగ్ నేర్పిస్తున్న నాగ చైతన్య.. కపుల్ గోల్స్.. ఫొటోలు వైరల్..
నాగచైతన్య కార్ రేసింగ్, బైక్ రేసింగ్ చేస్తాడని తెలిసిందే.

Naga Chaitanya Gives Racing Training to Sobhita in Chennai
Naga Chaitanya – Sobhita : నాగ చైతన్య – శోభిత ధూళిపాళ గత డిసెంబర్ లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పట్నుంచి ఈ ఇద్దరూ తమ సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేసినా వైరల్ అవుతూనే ఉన్నాయి. పెళ్లి తర్వాత తండేల్ సినిమాతో బిజీగా ఉన్న చైతు గత నెలలో తండేల్ రిలీజ్ అయి పెద్ద హిట్ కొట్టి 100 కోట్ల గ్రాస్ సాధించడంతో కాస్త ఫ్రీ అయ్యాడు. దీంతో చైతన్య తన భార్య శోభితతో టైం స్పెండ్ చేస్తున్నాడు.
నాగచైతన్య కార్ రేసింగ్, బైక్ రేసింగ్ చేస్తాడని తెలిసిందే. చైతుకి కార్ రేసింగ్, బైక్ రేసింగ్ అంటే చాలా ఇష్టం. షూటింగ్స్ లేనప్పుడు, ఖాళీ సమయాల్లో రేసింగ్ చేస్తూ ఉంటాడు చైతూ. చెన్నైలో ఉన్న మద్రాస్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ లో చైతూకి మెంబర్షిప్ కూడా ఉంది. అయితే ఇప్పుడు తన భార్య శోభితకు కార్ రేసింగ్ నేర్పిస్తున్నాడు చైతన్య.
తాజాగా మద్రాస్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ లో శోభిత కార్ రేసింగ్ చేస్తున్న ఫోటో, నాగచైతన్యతో కలిసి అక్కడ దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఈ జంట కార్ రేసింగ్ చేస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు అని తెలుస్తుంది. ఇక చైతూ తన భార్యకు రేసింగ్ నేర్పిస్తున్నాడు. ఈ ఫొటోలు చూసి ఫ్యాన్స్, నెటిజన్లు కపుల్ గోల్స్ అంటే ఇవేనేమో, ఇద్దరూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారుగా అని కామెంట్స్ చేస్తున్నారు.