Pawan Kalyan : అప్పుడు గుండెలపై రాళ్లు పగలగొట్టుకున్నాను.. ఇప్పుడు నా కొడుకుని ఎత్తుకోలేకపోతున్నాను.. తన హెల్త్ పై పవన్ కామెంట్స్..
ఇండైరెక్ట్ గా తన ఆరోగ్యం గురించి కూడా మాట్లాడారు పవన్.

Pawan Kalyan Indirect Comments on his Health
Pawan Kalyan : నిన్న పిఠాపురంలో జనసీన్ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. పవన్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మొదటి సభ కావడంతో గ్రాండ్ గా చేసారు. భారీగా పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు హాజరయ్యారు. సాధారణంగానే పవన్ స్పీచ్ అంటే అందరికి ఆసక్తి. అలాంటిది గెలిచిన తర్వాత ఆవిర్భావ వేడుకలో పవన్ ఏం మాట్లాడతాడు అని అందరూ ఎదురుచూసారు. పవన్ కళ్యాణ్ నిన్న జనసేన జయకేతనం సభలో దాదాపు గంటపైగా మాట్లాడారు. అనేక అంశాల గురించి మాట్లాడారు. ఈ క్రమంలో ఇండైరెక్ట్ గా తన ఆరోగ్యం గురించి కూడా మాట్లాడారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. నేను మార్షల్ ఆర్ట్స్ చేసేటపుడు మూడు గ్రానైట్ రాళ్లు గుండెల మీద పెట్టుకొని కొట్టించుకునేవాడ్ని. గుడుంబా శంకర్ సినిమాలో ముగ్గురు పిల్లల్ని ఎత్తుకొని నడిచాను. చూడటానికి బక్కగానే ఉంటా కానీ బలంగా ఉండేవాడిని. కానీ ఇప్పుడు నా రెండో కొడుకుని ఎత్తుకోలేకపోతున్నాను. అంత బలహీనపడిపోయాను. నా పెద్ద కొడుకుని ఇప్పుడు ఎలాగో ఎత్తుకోలేను. రెండో కొడుకుకి ఏడేళ్లు ఉంటాయి. వాడ్ని ఎత్తుకోలేకపోతున్నాను. అంత బలహీనమయ్యాను. మళ్ళీ బలం తెచ్చుకుంటా మళ్ళీ బద్దలుకొడతా అని అన్నారు.
Also See : Janasena Formation Day : జనసేన ఆవిర్భావ వేడుకలు.. పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ ఫొటోలు..
దీంతో పవన్ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. పవన్ సినిమాల్లోకి వచ్చినప్పుడు బక్కగా ఉండేవారు. మొదటి సినిమాలోనే తన మార్షల్ ఆర్ట్స్ చూపించాడు. గుండెలపై రాళ్లు పెట్టుకొని పగలగొట్టించుకున్నాడు. తమ్ముడు, జానీ.. పలు సినిమాల్లో కూడా తన మార్షల్ ఆర్ట్స్ చూపించాడు. గుడుంబా శంకర్ లో ఓ పాటలో ముగ్గురు పిల్లలని ఎత్తుకొని పరిగెత్తాడు. అలాంటిది ఇప్పుడు తన చిన్న కొడుకుని ఎత్తుకోలేనంత బలహీనపడిపోయాను అని తన హెల్త్ గురించి వాపోయారు పవన్.
Also Read : “ఇలా బతకడం మానవత్వాన్ని కోల్పోవడమే” అంటూ బండ్ల గణేశ్ కామెంట్లు.. ఇంతకీ ఎవరికి కౌంటర్ ఇచ్చినట్టు?
ఏజ్ పెరగడం, సినిమాల్లో లేకపోవడంతో బాడీ ఫిట్నెస్ మెయింటైన్ చేయకపోవడంతో పవన్ బలహీనపడుతున్నట్టు భావిస్తున్నారు ఫ్యాన్స్. అయితే మళ్ళీ బలంగా తయారయ్యి బద్దలుకొడతాను అన్నారు పవన్. ఇటీవల పవన్ కుంభమేళాకు వెళ్ళినప్పుడు ఆయన లుక్స్ పై కొంతమంది ట్రోల్స్ చేసారు. త్వరలో OG సినిమాకు డేట్స్ ఇస్తాడు. అందులో మార్షల్ ఆర్ట్స్ సీన్స్ ఉన్నాయి అని గతంలోనే ఓ ఫోటో రిలీజ్ చేసి మూవీ యూనిట్ చెప్పారు. కాబట్టి మళ్ళీ బలంగా మారి మంచి బాడీని తీసుకొస్తాడు, OG సినిమాలో మార్షల్ ఆర్ట్స్ సీన్స్ ఉంటాయి అని పవన్ ఫ్యాన్స్ అంటున్నారు.