విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నానీ హీరోగా నటింస్తున్న సినిమా గ్యాంగ్ లీడర్… ఈ సినిమా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఇవాళ (సెప్టెంబర్ 10, 2019)న వైజాగ్‌లోని గురుజాడ కళాక్షేత్రంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. సాయంత్రం 6 గంటల నుంచి కార్యక్రమం జరుగుతుందని పోస్టర్‌లో తెలిపారు.
ఈ సినిమాలో కార్తికేయ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ప్రియాంక, లక్ష్మి, శరణ్య, అనీష్ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం అనిరుధ్ రవిచంద్రన్ అందించారు.
ఇక గ్యాంగ్ లీడర్ తరువాత నాని ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘వి’ సినిమాలో నటించనున్నారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది.