Nanna Nuv Naa Pranam Father Emotional Song Released From Animal Movie
Animal Song : రణబీర్ కపూర్(Ranbir Kapoor), రష్మిక మందన్న జంటగా అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో ‘యానిమల్’(Animal) సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ డిసెంబర్ 1న పాన్ ఇండియా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాపై బాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. డాన్ లాంటి కథాంశంతో పాటు ప్రేమ, ఎమోషన్స్ అన్ని చూపించబోతున్నారు ఈ సినిమాలో.
ఇప్పటికే యానిమల్ సినిమా టిజర్ రిలీజ్ అవ్వగా సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇక యానిమల్ సినిమా నుంచి రెండు పాటలు రిలీజ్ అవ్వగా తాజాగా ‘నాన్న నువ్వు నా ప్రాణం..’ అంటూ సాగే పాట రిలీజయింది. ఈ సాంగ్ లో రణబీర్ కపూర్, అతని తండ్రి అనిల్ కపూర్ కి మధ్య ఉన్న బంధాన్ని చూపించారు. దీంతో సినిమా తండ్రి – కొడుకుల మధ్య కథలా ఉండబోతుందని, మంచి ఫాదర్ ఎమోషన్ కూడా ఉండబోతుందని తెలుస్తుంది.
Also Read : Shouryuv : నాని ‘హాయ్ నాన్న’ సినిమా డైరెక్టర్ శౌర్యువ్ ఈ సోషల్ మీడియా స్టార్‌కి అన్నయ్య?
ఇక ఈ సాంగ్ అయిదు భాషల్లోనూ రిలీజ్ చేశారు. తెలుగులో ఈ సాంగ్ మంచి మెలోడీతో మెప్పించింది. ఈ పాట వింటే ఎవ్వరికైనా వాళ్ళ నాన్న గుర్తొచ్చి కన్నీళ్లు పెడతారు కచ్చితంగా, అంతలా ఎమోషన్ చూపించారు ఈ పాటలో. ప్రస్తుతం ఈ సాంగ్ వైరల్ గా మారింది. ఇక ఈ పాటని అనంత శ్రీరామ్ రాయగా, హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అందించారు. సింగర్ సోను నిగమ్ పాడారు.