Shouryuv : నాని ‘హాయ్ నాన్న’ సినిమా డైరెక్టర్ శౌర్యువ్ ఈ సోషల్ మీడియా స్టార్‌కి అన్నయ్య?
ర్యువ్ ఇప్పుడు హాయ్ నాన్నతో దర్శకుడిగా మారాడు. అయితే శౌర్యువ్ ఓ సోషల్ మీడియా స్టార్ కి అన్నయ్య అని ఇటీవలే అందరికి తెలిసిందే.

Hi Nanna Movie Director Shouryav is Brother to a Popular Social Media Star
Shouryuv : నాని(Nani) త్వరలో హాయ్ నాన్న(Hi Nanna) అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాతో శౌర్యువ్ అనే కొత్త డైరెక్టర్ పరిచయం అవుతున్నాడు. పలు సినిమాలకు దర్శకత్వ శాఖలో చేసిన శౌర్యువ్ ఇప్పుడు హాయ్ నాన్నతో దర్శకుడిగా మారాడు. అయితే శౌర్యువ్ ఓ సోషల్ మీడియా స్టార్ కి అన్నయ్య అని ఇటీవలే అందరికి తెలిసిందే.
సోషల్ మీడియా స్టార్ నిఖిల్ విజయేంద్ర సింహ(Nikhil Vijayendra Simha).. హాయ్ నాన్న డైరెక్టర్ శౌర్యువ్ యువరాజ్ సింహకి సొంత తమ్ముడు అవుతాడు. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ లో వీడియోలతో బాగా పాపులర్ అయ్యాడు నిఖిల్ విజయేంద్ర సింహ. సెలబ్రిటీలని కొత్తగా ఇంటర్వ్యూలు చేస్తూ యూట్యూబ్ లో బాగా పాపులర్ అయ్యాడు నిఖిల్. మంచు లక్ష్మి, నిహారిక, వితిక.. వీళ్ళందరికీ నిఖిల్ బాగా క్లోజ్ ఫ్రెండ్ అయ్యాడు కూడా. చాలామంది సినిమా వాళ్ళ పార్టీల్లో నిఖిల్ కచ్చితంగా ఉంటాడు. సినిమా ప్రమోషన్స్ లో నిఖిల్ కి కూడా ఇంటర్వ్యూలు ఇస్తారు మూవీ యూనిట్. ఇటీవల రెగ్యులర్ గా సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో యాక్టివ్ గా ఉంటున్నాడు నిఖిల్.
Also Read : Devara Update : ‘దేవర’పై అప్డేట్ ఇచ్చిన మూవీ యూనిట్.. ఫెస్టివల్ బ్రేక్ అయిపోయింది..
అన్నయ్య డైరెక్టన్ సైడ్ వెళ్తే తమ్ముడు ఇలా యాక్టింగ్, యాంకరింగ్ సైడ్ కి వెళ్ళాడు. అన్నయ్య కంటే ముందే తమ్ముడు సక్సెస్ అవ్వగా ఇప్పుడు అన్నయ్య కూడా సక్సెస్ అవుతున్నాడు. ఇటీవల శౌర్యువ్ తమ్ముడు నిఖిల్ బర్త్ డే కి విషెస్ చెప్తూ తన సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ చేశాడు. ఓ ఇంటర్వ్యూలో కూడా తమ్ముడి గురించి చెప్పాడు శౌర్యువ్. ఇప్పుడు నిఖిల్, శౌర్యువ్.. వాళ్ళ ఫ్యామిలీ అంతా ఉన్న ఫోటో ఒకటి వైరల్ గా మారింది. వీరికి ఒక చెల్లి కూడా ఉందని ఈ ఫ్యామిలీ ఫోటో చూస్తే తెలుస్తుంది.