Devara Update : ‘దేవర’పై అప్డేట్ ఇచ్చిన మూవీ యూనిట్.. ఫెస్టివల్ బ్రేక్ అయిపోయింది..
దేవర సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. దేవర షూటింగ్ ఇప్పటికే పలు ప్రదేశాల్లో జరిగింది. కొన్ని సెట్స్ లో, కొంత భాగం గోవాలో షూటింగ్ జరిగింది.

NTR Devara Movie Update given by Movie Unit
Devara Update : RRR సినిమా తర్వాత ఎన్టీఆర్(NTR) ‘దేవర’ సినిమాతో రాబోతున్నారు. కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వంలో రెండు పార్టులుగా దేవర సినిమా భారీగా తెరకెక్కుతుంది. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్(Janhvi Kapoor) ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక ఈ మూవీలో సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు షైన్ టామ్ చాకో విలన్స్ గా కనిపించబోతున్నారు. మిక్కిలినేని సుధాకర్ తో కలిసి నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.
ఇక దేవర సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. దేవర షూటింగ్ ఇప్పటికే పలు ప్రదేశాల్లో జరిగింది. కొన్ని సెట్స్ లో, కొంత భాగం గోవాలో షూటింగ్ జరిగింది. ఇటీవల రెండు వారాల క్రితమే గోవాలో షూటింగ్ షెడ్యూల్ ముగిసింది. జాన్వీ గోవా షెడ్యూల్ పూర్తి చేసిన తర్వాత సినిమా నుంచి తన లుక్ కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు దీపావళి ఫెస్టివల్ బ్రేక్ తీసుకున్న మూవీ యూనిట్ మళ్ళీ షూటింగ్ కి వెళ్లనుంది.
Also Read : Salaar Movie : ‘సలార్’ ప్రమోషన్స్ కోసం రంగంలోకి RCB.. గ్రాండ్ గానే ప్లాన్ చేస్తున్నారుగా..
తాజాగా దేవర సినిమాపై అప్డేట్ ఇస్తూ.. ఫెస్టివల్ బ్రేక్ అయిపోయిన తర్వాత, ఎంతో కష్టపడే మా టీం మళ్ళీ అద్భుతమైన షెడ్యూల్ మొదలుపెడుతుంది అని ట్వీట్ చేశారు. అలాగే సినిమా రిలీజ్ పై మరోసారి క్లారిటీ ఇస్తూ దేవర పార్ట్ 1 2024 ఏప్రిల్ 5న రిలీజవుతుందని ప్రకటించారు. దేవర సముద్ర తీరాల్లో జరిగే చాలా పవర్ ఫుల్ కథ అని డైరెక్టర్ కొరటాల శివ ఆల్రెడీ చెప్పి సినిమాపై అంచనాలు పెంచిన సంగతి తెలిసిందే. దీంతో సముద్రం ఉన్న మంచి మంచి లొకేషన్స్ వెతికి మరీ దేవర సినిమా షూట్ చేస్తున్నారు. ఇప్పుడు గోకర్ణలో షూట్ చేయబోతున్నట్టు సమాచారం.
After a brief festival break, our hardworking team is back on sets for another epic schedule.#Devara Part 1 – A big screen extravaganza unveiling on April 5th 2024.
— Devara (@DevaraMovie) November 14, 2023