Salaar Movie : ‘సలార్’ ప్రమోషన్స్ కోసం రంగంలోకి RCB.. గ్రాండ్ గానే ప్లాన్ చేస్తున్నారుగా..

సలార్ పార్ట్ 1 ట్రైలర్ డిసెంబర్ 1న రిలీజ్ చేస్తారని ఇటీవలే ప్రకటించారు చిత్రయూనిట్. దీంతో ప్రభాస్ అభిమానులతో పాటు, సినిమా లవర్స్ అంతా ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్నారు.

Salaar Movie : ‘సలార్’ ప్రమోషన్స్ కోసం రంగంలోకి RCB.. గ్రాండ్ గానే ప్లాన్ చేస్తున్నారుగా..

RCB Team Promoting Prabhas Salaar Movie

Updated On : November 14, 2023 / 9:59 AM IST

Salaar Movie : ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో ప్ర‌భాస్ (Prabhas) హీరోగా తెరకెక్కుతున్న సినిమా సలార్ (Salaar). ఇప్పటికే ఈ సినిమా అనేకసార్లు వాయిదా పడగా డిసెంబర్ 22న రిలీజ్ చేస్తారని ఇటీవల కన్ఫర్మేషన్ ఇచ్చింది చిత్రయూనిట్. సలార్ సినిమా కుడా రెండు పార్టులుగా రాబోతుంది. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ టీజర్ కొన్ని రోజుల క్రితం రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచారు.

ఇక సలార్ పార్ట్ 1 ట్రైలర్ డిసెంబర్ 1న రిలీజ్ చేస్తారని ఇటీవలే ప్రకటించారు చిత్రయూనిట్. దీంతో ప్రభాస్ అభిమానులతో పాటు, సినిమా లవర్స్ అంతా ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే సినిమా రిలీజ్ వచ్చే నెలలో ఉన్నా ప్రమోషన్స్ ఏం మొదలు పెట్టట్లేదు అని అభిమానులు నిరాశ చెందుతున్నారు. తాజాగా ప్రమోషన్స్ కోసం సలార్ మూవీ యూనిట్ RCB టీంని దింపింది.

సలార్ నిర్మాతలు హోంబలె ఫిలిమ్స్ కన్నడ సంస్థ అని తెలిసిందే. దీంతో ఈ సంస్థ బెంగుళూరు ఐపీఎల్ టీంతో తమ సినిమాలకు ప్రమోషన్స్ చేయిస్తుంది. గతంలో KGF సినిమాకి కూడా RCB టీం ప్రమోషన్స్ చేసింది. తాజాగా సలార్ ట్రైలర్ గురించి RCB టీం ప్రమోట్ చేస్తూ ఓ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ లో కోహ్లీ వెనక్కి తిరిగి ఉండగా, సిరాజ్, మ్యాక్స్ వెల్ ఉండి సలార్ ట్రైలర్ డిసెంబర్ 1న రాబోతుందని ప్రమోట్ చేస్తున్నారు. మున్ముందు కూడా RCB టీం సలార్ కి ప్రమోషన్స్ చేస్తుందని సమాచారం. దీంతో విరాట్, ప్రభాస్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : Tamannaah : బాయ్ ఫ్రెండ్‌తో తమన్నా పెళ్లి.. త్వరలోనే?

ఇక సలార్ సినిమాలో శ్రుతి హాసన్(Shruti Haasan) హీరోయిన్ గా న‌టిస్తోంది. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran), జగపతి బాబు(Jagapathi Babu) విలన్స్ గా, శ్రియారెడ్డి కీల‌క పాత్ర‌ను పోషించింది.