Nara Rohit : నారా రోహిత్ కొత్త మూవీ అనౌన్స్‌మెంట్.. ప్రతినిధి సీక్వెలా..?

2018 తరువాత సినిమాలకు దూరమయ్యి ఏపీ పాలిటిక్స్ కనిపించిన నారా రోహిత్.. తాజాగా తన కొత్త సినిమాని అనౌన్స్ చేశాడు. అయితే ఈ మూవీ తన సూపర్ హిట్ మూవీ ప్రతినిధికి..

Nara Rohit new movie announcement is Prathinidhi sequel

Nara Rohit : నారా వారి కుటుంబం నుంచి సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన హీరో నారా రోహిత్. బాణం సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్ కి పరిచయం అయిన రోహిత్.. సెకండ్ సినిమా ‘సోలో’ (Solo) మంచి గుర్తింపుని సంపాదించుకున్నాడు. రోహిత్ అందరి హీరోలా కమర్షియల్ సినిమాలు వైపు కాకుండా వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే 2014లో నారా రోహిత్ ని వచ్చిన పొలిటికల్ థ్రిల్లర్ ‘ప్రతినిధి’ (Prathinidhi) మంచి విజయం సాధించింది.

Ram Charan : రామ్ చరణ్‌ మొదటి రెమ్యూనరేషన్‌తో ఏమి కొన్నాడో తెలుసా..? ఎక్కువుగా కొనేదేంటో తెలుసా..?

ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది. 2018లో ‘వీర భోగ వసంత రాయలు’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన నారా రోహిత్.. అప్పటి నుంచి మరో సినిమాని రిలీజ్ చేయలేదు. ఈ మధ్యలో పొలిటికల్ ప్రచారాల్లో కనిపించడంతో.. ఈ హీరో సినిమాలకి గుడ్ బై చెప్పేశాడని అందరూ అనుకున్నారు. కానీ తాజాగా రోహిత్ తన కొత్త సినిమా గురించి అప్డేట్ ఇచ్చాడు. ఒక ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేస్తూ.. రేపు జులై 24న ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించాడు.

Kanguva Glimpse : ‘కుశలమా’ అంటూ భయపెడుతున్న సూర్య.. కంగువ గ్లింప్స్‌ చూశారా..?

ఇక ఈ ప్రీ లుక్ చూస్తుంటే.. ప్రతినిధి పోస్టర్ ని గుర్తు చేస్తుంది. అంతేకాదు ఈ పోస్టర్ లో ‘2’ అని కూడా ప్రింట్ చేశారు. దీంతో ఈ మూవీ కచ్చితంగా ప్రతినిధికి సీక్వెల్ అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం నారా రోహిత్ కూడా ఏపీ పాలిటిక్స్ లో యాక్టీవ్ గా ఉండడంతో ఈ సీక్వెల్ పై మరింత ఆసక్తి కలిగింది. మరి ఇది నిజంగా ప్రతినిధి సీక్వెలా? కదా? అనేది చూడాలి. కాగా ప్రతినిధి సినిమాని ప్రశాంత్ మండవ డైరెక్ట్ చేశాడు. హీరో శ్రీవిష్ణు ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర చేశాడు.