Nara Rohith playing villain in Venkatesh-Trivikram film.
Nara Rohith: నారా రోహిత్.. టాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న నటుడు. హీరోగా మంచి మంచి సినిమాలు చేశాడు. సోలో సినిమాతో కెరీర్ లో మొదటి బ్రేక్ అందుకున్నాడు. ఆ తరువాత కూడా వరుసగా సినిమాలు చేస్తూ వచ్చాడు కానీ, అనుకున్న సక్సెస్ మాత్రం రాలేదు. అయితే, కేవలం హీరోగానే కాదు మంచి పాత్రలు వస్తే వేరే హీరోల సినిమాల్లో కూడా చేస్తానని ఇప్పటికే చెప్పాడు నారా రోహిత్(Nara Rohith).
అందుకే, దర్శకుడు సుకుమార్ పుష్ప సినిమాలో మంచి పాత్రను నారా రోహిత్ కి ఆఫర్ చేశాడట. అదే బన్వర్సింగ్ శకావత్. కానీ, అనుకొని కారణాల వల్ల ఆ పాత్ర మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ కి వెళ్ళింది. కానీ, నారా రోహిత్ చేసుంటే ఆ ఇంపాక్ట్ వేరేలా ఉండేది అని చాలా మంది ఇప్పటికి అంటూ ఉంటారు. ఆ పాత్ర మిస్ అయినందుకు నారా రోహిత్ కూడా చాలా బాధపడ్డాడట.
Jana Nayagan: ఇవాళే తుది తీర్పు.. జన నాయగన్ సినిమా విడుదల అవుతుందా?
అయితే, ఈసారి మాత్రం అస్సలు మిస్ అయ్యే ఛాన్స్ లేదు అనేలా ఉంది సిచువేషన్. అవును, నారా రోహిత్ మరో స్టార్ హీరో సినిమాలో నటించే అవకాశం దక్కించుకున్నాడట. ఆ హీరో మరెవరో కాదు విక్టరీ వెంకటేష్. ప్రస్తుతం ఈ హీరో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో ఆదర్శ కుటుంబం (AK 47) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో పవర్ ఫుల్ విలన్ పాత్ర కోసం నారా రోహిత్ ను అనుకున్నాడట త్రివిక్రమ్.
ఇదే విషయాన్ని నారా రోహిత్ దగ్గర ప్రస్తావించగా వెంటనే ఒప్పేసుకున్నాడట. పాత్ర కూడా ఆయనకు చాలా బాగా నచ్చిందని సమాచారం. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాలో నారా రోహిత్ పాత్రను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నాడట త్రివిక్రమ్. దీంతో, నారా రోహిత్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అతి త్వరలో సినిమాను కంప్లీట్ చేసి వినాయక చవితికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. మరి ఇంతకాలం హీరోగా అలరించిన నారా రోహిత్ విలన్ గా ఏమేరకు ఆకట్టుకుంటాడు అనేది చూడాలి.