Narappa Trailer: నారప్ప ట్రైలర్ వచ్చేసింది.. ఎప్పుడూ చూడని రోల్‌లో వెంకటేష్!

విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా నారప్ప. తమిళ సినిమా అసురన్ రీమేక్‌గా రూపొందించిన ఈ సినిమా జులై 20వ తేదీన అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదల కాబోతుంది.

Narappa Trailer: నారప్ప ట్రైలర్ వచ్చేసింది.. ఎప్పుడూ చూడని రోల్‌లో వెంకటేష్!

Narappa

Updated On : July 14, 2021 / 3:44 PM IST

Narappa Trailer: విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా నారప్ప. తమిళ సినిమా అసురన్ రీమేక్‌గా రూపొందించిన ఈ సినిమా జులై 20వ తేదీన అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదల కాబోతుంది.

ఈ సినిమాలో వెంకీ సరసన ప్రియమణి నటిస్తోండగా.. లేటెస్ట్‌గా ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్‌ను లేటెస్ట్‌గా విడుదల చేసింది చిత్రయూనిట్. వెంకటేష్ 74వ సినిమాగా “నారప్ప” విడుదల కాబోతుంది.

ఎప్పుడూ చూడని రోల్‌లో వెంకటేష్ నటించినట్లుగా ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. నారప్పలో వెంకటేష్ నటన అధ్భుతంగా ఉంటుంది అని ట్రైలర్ చూస్తేనే అనిపిస్తుంది.