Narasimha Naidu re release on the occasion of Balakrishna birthday
Balakrishna Narasimha Naidu : టాలీవుడ్ లో ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్ సినిమాలు అంటే ముందు గుర్తుకు వచ్చేది నందమూరి నటసింహ బాలకృష్ణ. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, చెన్నకేశవరెడ్డి, సింహా, రీసెంట్ గా వీరసింహారెడ్డి చిత్రాలతో బాక్స్ ఆఫీస్ వద్ద ఊచకోత కోశాడు. కాగా జూన్ 10న బాలయ్య బర్త్ డే ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ పుట్టినరోజుకి అభిమానులు నరసింహనాయుడు సినిమాని రీ రిలీజ్ చేసి బాలయ్య బర్త్ డేని సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. అయితే ఈ సినిమా అప్పటిలో ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసిందో తెలుసా? వాటి గురించి ఇప్పుడు తెలుసుకోండి.
Balakrishna : NBK108 టైటిల్ అప్డేట్.. దర్శకుడు బాబీ అండ్ బోయపాటి మూవీ అప్డేట్స్ పై న్యూస్..
ఈ సినిమాని బి గోపాల డైరెక్ట్ చేశారు. ఈ మూవీ కంటే ముందు వీరిద్దరి కాంబినేషన్ వేసిన ఫ్యాక్షన్ మూవీ సమరసింహారెడ్డి బ్లాక్ బస్టర్ ని అందుకోవడంతో నరసింహనాయుడు పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 2001 జనవరి 11న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా.. బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు రూ.20 కోట్ల వరకు షేర్ ని అందుకొని ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది. అంతేకాదు నాలుగు ఆటలతో 100 సెంటర్స్ లో 100 రోజులు ఆడి చరిత్ర సృష్టించింది. అలాగే 150 అండ్ 200 డేస్ కూడా రికార్డ్ స్థాయి సెంటర్స్‌లో ఆడి సెన్సేషన్ అయ్యింది. ఈ సినిమాతో ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్ చిత్రాలకు మరింత క్రేజ్ పెరిగింది.
Ustaad Bhagat Singh : ఉస్తాద్ అప్డేట్ ఇచ్చిన పవన్ నిర్మాతలు.. కీలక షెడ్యూల్ కోసం భారీ సెట్..
ఇక ఈ సినిమాకి కథ, మాటలు అందించిన పరుచూరి బ్రదర్స్ బాలయ్యతో చెప్పించిన డైలాగ్.. ‘కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా’ అనే పవర్ ఫుల్ డైలాగ్ కి థియేటర్స్ దద్దరిల్లి పోయాయి. ఈ సినిమాలో హీరోయిన్స్ గా సిమ్రాన్, ప్రీతి ఝంగియాని నటించారు. మణిశర్మ సంగీతం అందించాడు. నిన్న కొట్టేసింది, లక్స్ పాప సాంగ్స్ అప్పటిలో ఒక ఊపు ఊపేశాయి. కాగా ఈ సినిమాకి బాలకృష్ణ తొలి నంది అవార్డుని అందుకున్నాడు.