×
Ad

Rakul Preet Singh : రకుల్ ప్రీత్ జంటకి ప్రధాని మోదీ ప్రత్యేక శుభాకాంక్షలు..

బాలీవుడ్ కొత్త జంట రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీలకు ప్రధాని మోదీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ లెటర్ పోస్ట్ చేశారు.

  • Published On : February 22, 2024 / 07:20 PM IST

narendra modi wishes to Rakul Preet Singh Jackky Bhagnani

Rakul Preet Singh : అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్.. బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో ఏడడుగులు వేసేసారు. నిన్న ఫిబ్రవరి 21న గోవాలో కుటుంబసభ్యులు మరియు సన్నిహితుల మధ్య రకుల్-జాకీ పెళ్లి ఘనంగా జరిగింది. కాగా రకుల్ అండ్ జాకీ మొదటిలో తమ పెళ్లిని దుబాయ్ లేదా మాల్దీవ్స్ లో చేసుకోవాలని అనుకున్నారు. కానీ మాల్దీవ్స్ ఇష్యూ, ఇండియా టూరిజం అభివృద్ధి గురించి మోదీ మాట్లాడటంతో గోవాకి పెళ్లి వేదిక మార్చుకున్నారు.

సౌత్ గోవాలోని ITC గ్రాండ్ లో జరిగిన ఈ పెళ్లికి హాజరుకావాలంటూ ప్రధాని మోదీకి కూడా ఆహ్వానం పంపించారు. అయితే ఆయనకి ఉన్న షెడ్యూల్స్ వల్ల ఆయన వెళ్లడం కుదరలేదు. దీంతో సోషల్ మీడియా ద్వారా కొత్త జంటకి శుభాకాంక్షలు తెలియజేసారు. “కొత్త ప్రయాణం మొదలు పెడుతున్న రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను” అంటూ మోదీ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.

Also read : Ram Charan : రామ్‌చరణ్‌పై మెగా ఫ్యాన్స్ చేస్తున్న ఈ మీమ్స్ చూస్తే.. నవ్వకుండా ఉండలేరు..

ఇక మోదీ విషెస్ కి రకుల్ ప్రీత్ సింగ్ రియాక్ట్ అవుతూ ట్వీట్ చేశారు. “మీరు ఇచ్చిన ఆశీర్వాదాలు మాకు ఎంతో ముఖ్యమైనవి. చాలా కృతజ్ఞతలు మోదీ గారు” అంటూ పేర్కొన్నారు. జాకీ భగ్నానీ కూడా మోదీకి థాంక్యూ చెబుతూ ట్వీట్ చేశారు. “మీ ఆశీర్వాదాలు మా గుండెను హత్తుకున్నాయి” అంటూ జాకీ చెప్పుకొచ్చారు.

కాగా జాకీ భగ్నానీ, రకుల్ 2021 లో తన ప్రేమాయణాన్ని అందరికి ప్రకటించారు. ఇక అప్పట్నుంచి ముంబైలో చెట్టపట్టాలు ఏసుకొని తిరుగుతూ ప్రేమ జర్నీని బాగా ఎంజాయ్ చేశారు. ఈ మంగళవారం పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఇక పెళ్లి వేడుక మొదట సిక్కు సంప్రదాయంలో, ఆ తరువాత సింధీ సంప్రదాయ పద్దతిలో జరిగినట్లు సమాచారం. పెళ్లిని డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో చేసుకున్న ఈ జంట.. ముంబైలో అందరి కోసం త్వరలో గ్రాండ్ రిసెప్షన్ ని నిర్వహించనున్నారు.