MAD 2 : ఎన్టీఆర్ బామ్మర్ది సినిమా సీక్వెల్ వచ్చేస్తుంది.. ‘మ్యాడ్ స్క్వేర్’ తో పిచ్చెక్కించడానికి రెడీ..

తాజాగా నేడు మ్యాడ్ స్క్వేర్ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. 

Narne Nithin Sangeeth Shoban Mad Square Movie First Look Released

MAD 2 : ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ మొదటి సినిమాగా మ్యాడ్ అనే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ కొట్టాడు. ఈ సినిమాలో నార్నె నితిన్ తో పాటు సంగీత్ శోభన్, రామ్ నితిన్ లు హీరోలుగా నటించారు. గత సంవత్సరం మ్యాడ్ చిన్న సినిమాగా రిలీజయి మంచి కలెక్షన్స్ రాబట్టి భారీ హిట్ కొట్టింది. దీంతో ఆ సినిమాకి సీక్వెల్ ప్రకటించారు.

Also Read : Devara Song : రేపే ‘దేవర’ ఆయుధ పూజ.. ఎన్నింటికి అంటే..? ఏ రేంజ్‌లో ఉంటుందో..

మ్యాడ్ సీక్వెల్ గా మ్యాడ్ స్క్వేర్ టైటిల్ తో అదే టీమ్ తో సినిమాని తెరకెక్కిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్‌, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ బ్యానర్స్ పై నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మాణంలో కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో మ్యాడ్ స్క్వేర్ సినిమా రాబోతుంది. తాజాగా నేడు మ్యాడ్ స్క్వేర్ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు.

ఈ పోస్టర్ లో నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ లు ముగ్గురు సాంప్రదాయంగా పంచెకట్టులో కనపడ్డారు. మ్యాడ్ సినిమాకు ఈ ఫస్ట్ లుక్ కి అసలు సంబంధమే లేదు. దీంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందో, ఇంకెంత ఎంటర్టైన్మెంట్ ఇస్తారో చూడాలి. అలాగే ఈ సినిమా మొదటి సాంగ్ సెప్టెంబర్ 20న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. త్వరలోనే ఈ సినిమాని కూడా రిలీజ్ చేయనున్నారు.