Trisha : త్రిష, మన్సూర్ వివాదంపై జాతీయ మహిళా కమిషన్ ఫైర్.. డీజీపీకి ఫిర్యాదు!

త్రిష మన్సూర్ వివాదం పై జాతీయ మహిళా కమిషన్ ఫైర్ అయ్యింది. ఈ విషయాన్ని సుమోటో (suo motu) గా తీసుకోని నేరుగా డీజీపీ దృష్టికి..

National Commission for Women reaction on Trisha Mansoor Ali Khan conflict

Trisha – Mansoor Ali Khan : తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ ఇటీవల నటి త్రిషపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మన్సూర్ అలీఖాన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “నేను చాలా సినిమాల్లో చాలా మంది హీరోయిన్స్ తో రేప్ సీన్స్ చేశాను. ఆ సీన్స్ నేను చాలా ఎంజాయ్ చేశాను. అయితే లియో సినిమాలో హీరోయిన్ త్రిషతో నాకు ఆ సీన్ చేసే ఛాన్స్ రాలేదు. మూవీలో అలాంటి సీన్ లేదని బాధపడ్డాను” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇక ఈ వ్యాఖ్యలపై త్రిషతో పాటు ప్రతి ఒక్కరు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు.

ఈక్రమంలోనే త్రిషకి సపోర్ట్ గా లియో దర్శకుడు లోకేష్ కానగరాజ్, దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు, మాళవిక, చిన్మయి, నితిన్.. వంటి ప్రముఖులు కూడా ట్వీట్స్ చేస్తూ వస్తున్నారు. ఇక ఈ విషయాన్ని జాతీయ మహిళా కమిషన్ (NCW) కూడా సీరియస్ గా తీసుకుంది. నటి త్రిషపై మన్సూర్ అలీఖాన్ చేసిన కామెంట్స్ ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామంటూ పేర్కొంది. ఈ విషయాన్ని సుమోటో (suo motu) గా తీసుకోని నేరుగా డీజీపీ దృష్టికి తీసుకు వెళ్తామంటూ తెలియజేసింది.

ఐపీసీ సెక్షన్ 509B మరియు ఇతర మహిళా చట్టాలను కూడా పరిశీలించి ఈ విషయం పై సరైన చర్యలు తీసుకుంటామని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇక ఈ పోస్టుని త్రిష ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ తెలియజేశారు. ఇది ఇలా ఉంటే, మన్సూర్ అలీఖాన్.. తన మీద తప్పుడు ప్రచారం జరుగుతోందని, తాను ఎలాంటి వాడినో అందరికీ తెలుసని సోషల్ మీడియాలో ఒక పోస్టు వేశారు.

Also read : Naga Shaurya : నాగశౌర్య దంపతుల ఫస్ట్ యానివర్సరీ.. లవ్లీ వీడియో చూసారా?

మన్సూర్ అలీఖాన్ తన సోషల్ మీడియాలో ఇలా రాసుకొచ్చారు.. “నేను పూర్తిగా మాట్లాడింది చూడకుండా కొంత వరకు మాత్రమే కట్ చేసి యూట్యూబ్, సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. నాపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. ఇటీవల నేను పాలిటిక్స్ లో చేరిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో పోటీ కూడా చేయబోతున్నాను. దీంతో నన్ను నెగిటివ్ చేయడానికే ఈ ప్రయత్నం చేస్తున్నారు. అయినా నేను ఎన్ని సేవ కార్యక్రమాలు చేశానో, నేను ఎలాంటివాడినో తమిళ ప్రజలకు తెలుసు” అంటూ పేర్కొన్నారు.