Nandi Awards : నంది అవార్డ్స్ పై రచ్చ.. అమరావతిలో భూములు తీసుకున్నారు కదా.. నట్టి కుమార్!

నంది అవార్డ్స్ విషయంలో టాలీవుడ్ రచ్చ. వైసీపీ పై అశ్విని దత్త్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Nandi Awards : ఇటీవల ఒక ప్రెస్ మీట్ లో టాలీవుడ్ సీనియర్ నిర్మాత అశ్విని దత్త్ నంది అవార్డ్స్ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. “ప్రభుత్వానికి నంది అవార్డు ఇచ్చే ఆసక్తి లేదు. ఎందుకంటే ప్రస్తుతం నడుస్తున్న సీజన్ వేరు. ఉత్తమ గుండా, రౌడీ కోసం పోటీపడుతున్నారు. ప్రెజెంట్ వాళ్ళకి ఇస్తారు. సినిమాలకు ఇచ్చే అవార్డులు ఇచ్చే రోజులు ఇంకా రెండు మూడేళ్ళలో వస్తుంది” అంటూ వ్యాఖ్యానించారు. ఇక ఈ కామెంట్స్ పై ఇటీవల ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కి చైర్మన్ అయిన పోసాని కృష్ణ మురళి ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే.

Posani Krishna Murali : ఆదిశేషగిరిరావు, అశ్విని దత్త్ వ్యాఖ్యలు పై ఘాటుగా స్పందించిన పోసాని.. చిరంజీవి అంటే!

తాజాగా నిర్మాత నట్టి కుమార్ అశ్విని దత్త్ వ్యాఖ్యలు ఖండిస్తూ మాట్లాడాడు. “నంది అవార్డ్స్ గురించి ఎందుకు గొడవ పడుతున్నారో నాకు తెలియటం లేదు. రెండు రాష్టాల ప్రభుత్వాలు 2014 నుండి అవార్డ్స్ ని ఇవ్వడం లేదన్న విషయం నిజమే. అయితే ఆ అవార్డ్స్ గురించి 2014 నుండి 2019 వరకు ఎందుకు మీరు ప్రశ్నించలేదు. టిడిపికి సపోర్ట్ గానే అశ్విన్ దత్ మాట్లాడారు. అమరావతిలో భూములు తీసుకున్నారు కదా?” అంటూ నట్టి కుమార్ వ్యాఖ్యానించాడు.

NTR 100 Years : ఎన్టీఆర్ 40 ఏళ్ళ వయసులో కూచిపూడి నేర్చుకున్నారు.. ఏ సినిమా కోసమో తెలుసా?

కరోనాతో 5కోట్ల మంది ప్రజలు ఇబ్బంది పడుతుంటే వాళ్ళను చూసుకో వద్దా? అంటూ ప్రశ్నించిన నట్టి కుమార్ తెలంగాణ నాయకులను ఎందుకని నంది అవార్డ్స్ గురించి అడగరు అంటూ నిలదీశాడు. రౌడీలకు అవార్డ్స్ ఇవ్వండి అనటం తప్పు అంటూ హితవు పలికాడు. కాగా గతంలో ఈ అవార్డ్స్ గురించి సీనియర్ నిర్మాత సి కళ్యాణ్ రెండు ప్రభుత్వాలని ప్రశ్నించగా.. తెలంగాణ ప్రభుత్వం వెంటనే బదులిస్తూ త్వరలోనే ఆగిపోయిన అన్ని సంవత్సరాల నంది అవార్డ్స్ ని ప్రకటిస్తామంటూ మంత్రి తలసాని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు నంది అవార్డ్స్ పై ఎటువంటి వివరణ ఇవ్వలేదు.

 

ట్రెండింగ్ వార్తలు