Posani Krishna Murali : ఆదిశేషగిరిరావు, అశ్విని దత్త్ వ్యాఖ్యలు పై ఘాటుగా స్పందించిన పోసాని.. చిరంజీవి అంటే!

ఉత్తమ గుండా, రౌడీ అంటూ అశ్విని దత్త్, ఆదిశేషగిరిరావు చేసిన వ్యాఖ్యలు పై ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కి చైర్మన్ పోసాని కృష్ణ మురళి ఘాటుగా స్పందించాడు.

Posani Krishna Murali : ఆదిశేషగిరిరావు, అశ్విని దత్త్ వ్యాఖ్యలు పై ఘాటుగా స్పందించిన పోసాని.. చిరంజీవి అంటే!

Posani Krishna Murali reaction on aswini dutt comments

Posani Krishna Murali : టాలీవుడ్ సీనియర్ నిర్మాతలు ఆదిశేషగిరిరావు, అశ్విని దత్త్ నేడు (మే 1) జరిగిన ఒక ప్రెస్ మీట్ లో నంది అవార్డులు గురించి మాట్లాడుతూ.. “ప్రభుత్వానికి ఆ అవార్డు ఇచ్చే ఆసక్తి లేదు. ఎందుకంటే ప్రస్తుతం నడుస్తున్న సీజన్ వేరు. ఉత్తమ గుండా, రౌడీ కోసం పోటీపడుతున్నారు. ప్రెజెంట్ వాళ్ళకి ఇస్తారు. సినిమాలకు ఇచ్చే అవార్డులు ఇచ్చే రోజులు ఇంకా రెండు మూడేళ్ళలో వస్తుంది” అంటూ వ్యాఖ్యానించారు. తాజాగా ఈ వ్యాఖ్యలు పై టాలీవుడ్ నటుడు మరియు ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కి చైర్మన్ పోసాని కృష్ణ మురళి ఘాటుగా స్పందించాడు.

Tollywood : ప్రభుత్వాల పై టాలీవుడ్ నిర్మాతల సంచలన కామెంట్స్.. ఉత్తమ గుండా, రౌడీ కోసం పోటీపడుతున్నారు..

“అశ్విని దత్త్ అన్న నువ్వు మాట్లాడాల్సింది ఉత్తమ రౌడీ, ఉత్తమ గుండా అని కాదు. ఉత్తమ వెన్నుపోటుదారుడు, ఉత్తమ లోఫర్, ఉత్తమ మోసగాడు అని మాట్లాడాలి. ఉత్తమ వేదవలు, ఉత్తన సన్యాసులు అని మీ వాళ్ళకే ఇవ్వాలి. ఎందుకని జగన్ గారి మీద పడి ఏడుస్తున్నారు. మీకేమి అన్యాయం చేశారు. చంద్రబాబు లాగా వెన్నుపోటు పొడిచారా? లేదా పలానా వారికీ అన్యాయం చేశాడని నిరూపించండి నేను నీ కాళ్ళకి దణ్ణం పెడతాను. ఎన్టీఆర్ ని చెప్పులతో కొట్టినప్పుడు నువ్వు ఏమి చేశావు. నీ బ్రతుకు నాకు తెలుసు నా బ్రతుకు నీకు తెలుసు. కొంచెమైన నీతితో బ్రతుకు” అంటూ పోసాని అశ్విని దత్త్ వ్యాఖ్యల పై విరుచుకుపడ్డాడు.

Simha Awards : సింహ అవార్డు ఇవ్వటం లేదు.. స్పందించిన తలసాని శ్రీనివాస్ యాదవ్!

జగన్ గారు అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతుందని, రెండేళ్లు కరోనా నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడుకున్నారని, తరువాత దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో దానికి ఇస్తూ ముందుకు వెళుతూ వెళ్తున్నారని చెప్పుకొచ్చాడు. ఇక ఆదిశేషగిరిరావు మాటలకు బదులిస్తూ.. “జగన్ గారు వచ్చిన తరువాత నంది అవార్డులు ఇవ్వలేదు. ఒకవేళ అవార్డులు ఇచ్చి ఉంటే, మీరు అన్నట్లు జరిగి ఉంటే మీరు విమర్శించవచ్చు. కానీ జగన్ గారు నంది అవార్డ్స్ ని ఎవరైతే అర్హులో వారికే అందజేస్తారు” అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక రజినీకాంత్ విజయవాడ పర్యటన గురించి మాట్లాడుతూ.. “రజనీకాంత్ చెన్నై నుంచి విజయవాడ వచ్చి రోజు చంద్రబాబును పొగుడుకోమనండి. మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అయితే ఆయన తమిళ వాళ్ళకే సూపర్ స్టార్ తెలుగు వాళ్లకు కాదు. మాకు ఇక్కడ పెద్ద సూపర్ స్టార్ ఉన్నారు. ఆయనే చిరంజీవి. చిరంజీవి గారికి జగన్ గారు అంటే ఎంతో ప్రేమ. అలాగే చిరంజీవి అంటే జగన్ గారికి కూడా ప్రేమ. అన్న అన్న అంటూ చిరంజీవికి వైఎస్సార్ గారికి ఇచ్చినంత గౌరవం ఇస్తారు జగన్ గారు” అంటూ వెల్లడించాడు.