Tollywood : ప్రభుత్వాల పై టాలీవుడ్ నిర్మాతల సంచలన కామెంట్స్.. ఉత్తమ గుండా, రౌడీ కోసం పోటీపడుతున్నారు..

నంది అవార్డులు గురించి మాట్లాడుతూ ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలు.. రెండు ప్రభుత్వాల పై సంచలన కామెంట్స్ చేశారు.

Tollywood : ప్రభుత్వాల పై టాలీవుడ్ నిర్మాతల సంచలన కామెంట్స్.. ఉత్తమ గుండా, రౌడీ కోసం పోటీపడుతున్నారు..

Tollywood producers viral comments on andhra pradesh and telangana

Tollywood : సినిమా ఆర్టిస్టులు మరియు టెక్నీషియన్స్ కి ఎన్ని అవార్డులు వచ్చినా ప్రభుత్వం నుంచి వచ్చే అవార్డుని ఎంతో గౌరవంగా భావిస్తారు. అలాంటి నంది అవార్డుని (Nandi Awards) 2016లో నుంచి ఇవ్వడం ఆపేశారు. ఈ పురస్కారం గురించి అప్పటి నుంచి సినీ ప్రముఖులు ఏపీ (Andhra Pradesh) మరియు తెలంగాణ (Telangana) ప్రభుత్వాలను అడుగుతూ వస్తున్నారు. ఈ విషయం పై ఇటీవల ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ రెండు ప్రభుత్వాల పై విమర్శలు కూడా చేశారు.

Ponnyin Selvan 2 : పొన్నియిన్ సెల్వన్ క్లైమాక్స్ పై వివాదం.. మణిరత్నంపై విమర్శలు..

ఆ వ్యాఖ్యలకు తెలంగాణ సినిమాటోగ్రాఫి మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించి.. త్వరలోనే అవార్డుల పై ఒక నిర్ణయానికి వచ్చి పురస్కార సభ కూడా నిర్వహిస్తామంటూ వ్యాఖ్యానించారు. సి కళ్యాణ్ విమర్శల పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించలేదు. తాజాగా ఈ అవార్డ్స్ గురించి మాట్లాడుతూ రెండు ప్రభుత్వాల పై టాలీవుడ్ ప్రముఖులు అశ్విని దత్త్, సూపర్ స్టార్ కృష్ణ బ్రదర్ జి ఆదిశేషగిరిరావు (నిర్మాత) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఒక ప్రెస్ మీట్ లో పాల్గొన్న వీరిద్దర్నీ నంది అవార్డ్స్ గురించి ప్రశ్నించారు.

Bholaa Shankar: అప్పుడు భాషా.. ఇప్పుడు భోళా శంకర్.. సేమ్ సెంటిమెంట్..?

దీని పై జి ఆదిశేషగిరిరావు స్పందిస్తూ.. “ప్రభుత్వాలకు వాటి పై పెద్ద ఆసక్తి లేదు. అలాని ఫిలిం ఇండస్ట్రీ ఆగిపోదు, ముందుకు వెళుతూనే ఉంటుంది. అయినా ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు అవార్డులు ఇచ్చుకుంటున్నారు. ఈ మధ్యలో ప్రభుత్వం ఇచ్చే అవార్డుకి విలువ పోయింది” అంటూ కామెంట్స్ చేశారు.

ఇక నిర్మాత అశ్విని దత్త్ అయితే కొంచెం ఘాటుగానే స్పందించారు. “ప్రస్తుతం నడుస్తున్న సీజన్ వేరు. ఉత్తమ గుండా, రౌడీ కోసం పోటీపడుతున్నారు. ప్రెజెంట్ వాళ్ళకి ఇస్తారు. సినిమాలకు ఇచ్చే అవార్డులు ఇచ్చే రోజులు ఇంకా రెండు మూడేళ్ళలో వస్తుంది” అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ మాటలు వైరల్ అవుతున్నాయి. మరి రెండు ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి నంది అవార్డ్స్ ని తెర పైకి తీసుకు వస్తారా? లేదా? చూడాలి.