Ponnyin Selvan 2 : పొన్నియిన్ సెల్వన్ క్లైమాక్స్ పై వివాదం.. మణిరత్నంపై విమర్శలు..

పొన్నియిన్ సెల్వన్ సినిమాలో కూడా చోళ వర్సెస్ పాండ్య కథ చూపించారు. చోళ రాజుని ఓ పాండ్య మహిళ చోళులని నమ్మించి ఎలా చంపేసింది అనేదే క్లైమాక్స్ లో చూపించారు.

Ponnyin Selvan 2 : పొన్నియిన్ సెల్వన్ క్లైమాక్స్ పై వివాదం.. మణిరత్నంపై విమర్శలు..

Controversy over the climax of Ponniyin Selvan 2

Ponnyin Selvan 2 : విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష, శోభిత, ఐశ్వర్య రాయ్, ఐశ్వర్య లక్ష్మి, ప్రభు, జయరాం.. ఇలా చాలా మంది స్టార్ కాస్ట్ తో మణిరత్నం(Maniratnam) దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్(Ponniyin Selvan) పార్ట్ 2 ఏప్రిల్ 28న పాన్ ఇండియా(Pan India) రిలీజయింది. పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 తమిళ్(Tamil) లో భారీ విజయం సాధించినప్పటికీ మిగిలిన చోట్ల మాత్రం అంతగా విజయం సాధించలేదు. కానీ పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 తో పోలిస్తే పార్ట్ 2 పర్వాలేదనిపిస్తుంది. అన్ని చోట్ల పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి ఈ సినిమాకు.

పొన్నియిన్ సెల్వన్ సినిమా చోళులు వర్సెస్ పాండ్య కథ అని అందరికి తెలిసిందే. ఒకప్పుడు తమిళనాడు రాజ్యాన్ని చోళులు, పాండ్యులు పరిపాలించారు. కొన్ని వేల సంవత్సరాలు తమిళనాడులో చోళ వర్సెస్ పాండ్య యుద్దాలు జరిగాయి. రాచరిక పాలన అంతరించినా ఇప్పటికి తమిళనాడులో చోళ వర్సెస్ పాండ్య అంటూ అప్పుడప్పుడు రచ్చ జరుగుతూనే ఉంటుంది. గతంలో వచ్చిన యుగానికి ఒక్కడు సినిమాలో కూడా చోళ వర్సెస్ పాండ్య అనే కథే చూపించారు.

ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్ సినిమాలో కూడా చోళ వర్సెస్ పాండ్య కథ చూపించారు. చోళ రాజుని ఓ పాండ్య మహిళ చోళులని నమ్మించి ఎలా చంపేసింది అనేదే క్లైమాక్స్ లో చూపించారు. ఇది నిజంగా జరిగిన కథ నుంచే తీసుకున్నారు. ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్ పాండ్య మహిళగా నటించింది. విక్రమ్ పాండ్య మహిళ చేతిలో మరణించే చోళ రాజుగా నటించాడు. అయితే ఈ సినిమా క్లైమాక్స్ లో ఐశ్వర్యరాయ్ ప్రేమ వల్ల చంపలేకపోతే విక్రమ్ ఐశ్వర్య చేతిలో కత్తి పెట్టి తనంతట తానే పొడుచుకొని చచ్చిపోతాడు. ఇక్కడ ప్రేమ సన్నివేశాన్ని రసవత్తరంగా చూపించాడు మణిరత్నం.

అయితే ఇదే క్లైమాక్స్ ఇప్పుడు తమిళనాడులో వివాదంగా మారింది. ఇప్పటికి చోళులు అని చెప్పుకునే కొంతమంది ఈ క్లైమాక్స్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మణిరత్నాన్ని విమర్శిస్తున్నారు. చోళుల రాజు ఆదిత్య కరికాలుడిని పాండ్య మహిళా నందిని నమ్మించి మోసం చేసి చంపేసింది. అతను ఆత్మహత్య చేసుకోలేదు. సినిమాలో తనంతట తానే చనిపోయినట్టు చూపించారు. ఇది చాలా తప్పు, నందిని చేతిలో కరికాలుడు హత్య చేయబడ్డాడు అని కామెంట్స్ చేస్తూ చరిత్ర తెలుసుకోవాలని మణిరత్నంని విమర్శిస్తున్నారు. దీంతో తమిళనాడులో ఈ వివాదం పెద్దదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

Sara Arjun : PS2 లో జూనియర్ ఐశ్వర్యరాయ్ గా నటించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా? మీకు బాగా తెలిసిన చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంత పెద్దదైపోయిందో..

ఇక మరోవైపు పాండ్యులు అని చెప్పుకునే వాళ్ళు ఐశ్వర్య రాయ్ ఫొటోలతో పోస్టర్స్ వేసి వీర పాండ్య మహిళ. చోళ రాజుని చంపిన మా నందిని అంటూ మధురలో పోస్టర్స్ వేశారు. దీంతో తమిళనాడులో మరోసారి చోళ వర్సెస్ పాండ్య గొడవ మొదలయ్యేలా ఉంది. మరి దీనిపై మణిరత్నం కానీ, చిత్రయూనిట్ కానీ స్పందిస్తారేమో చూడాలి.