Hero Nani : చిత్ర పరిశ్రమను ఆదుకోండి.. జగన్ కు హీరో నాని రిక్వెస్ట్

రాజకీయాలు పక్కనపెట్టి తెలుగు చిత్ర పరిశ్రమను ఆదుకోవాలని సీఎం జగన్ కు విజ్ఞప్తి చేశారు నేచురల్ స్టార్ నాని. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ కి కృతఙ్ఞతలు తెలిపారు.

Hero Nani

Hero Nani : రిపబ్లిక్ చిత్రం ప్రీరిలీజ్ వేడుకల్లో జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. సినీ పరిశ్రమపై పెత్తనం చెలాయించాలని చూస్తే తాట తీస్తామని పవన్ ఘాటు హెచ్చరికలు చేశారు. పవన్ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. వరుసబెట్టి పవన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఈ సమయంలోనే టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని స్పందించారు. సినీ రంగం క్షేమంగా ఉండడమే ముఖ్యమని, పవన్ కల్యాణ్, ఏపీ ప్రభుత్వం మధ్య ఉన్న రాజకీయ విభేదాలను పక్కనబెట్టేద్దామని తెలిపారు.

Read More : Ketika Sharma:’రొమాంటిక్’ ట్రీట్.. కేతిక అందాలు అదరహో!

పవన్ కల్యాణ్ లేవనెత్తిన సమస్యలను పరిశీలించాల్సిన అవసరం ఉందని, దీనిపై తక్షణ స్పందన అవసరమని నాని అభిప్రాయపడ్డారు. చిత్ర రంగ ఇబ్బందులను పూర్తిస్థాయిలో ప్రస్తావించిన పవన్ కల్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమలో సభ్యుడిగా సీఎం జగన్, ఏపీ మంత్రులకు విజ్ఞప్తి చేసేది ఒక్కటే.. తెలుగు సినిమా మరింత దెబ్బదినకముందే స్పందించండి.. వెంటనే సమస్యలపై చర్యలు తీసుకోవాలని నాని కోరారు.

Read More : Pawan-Kartikeya: పవన్ సార్‌కి మద్దతు ఇవ్వడం నా బాధ్యత.. హీరో కార్తికేయ