Naveen Chandra comments about Prabhas fandom while Varsham movie time
Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ ఫాలోయింగ్ బాహుబలి తరువాత వచ్చిందని చాలామంది అనుకుంటుంటారు. కానీ బాహుబలికి ముందే ప్రభాస్ కి మాస్ లో ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. తన మొదటి కమర్షియల్ హిట్ ‘వర్షం’తోనే ప్రభాస్.. ఓ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. శోభన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ప్రభాస్ కెరీర్ లో మూడో సినిమా.
చిరంజీవి ‘అంజి’, బాలకృష్ణ ‘లక్ష్మీనరసింహ’ సినిమాలతో పాటు 2004 సంక్రాంతికి రిలీజైన ఈ చిత్రం 175 రోజులు పాటు థియేటర్స్ ఆడి ప్రభాస్ ని మాస్ హీరోని చేసింది. కాగా ఈ మూవీ 50 డేస్ ఫంక్షన్ ని భీమవరంలో ఏర్పాటు చేసారు. ఇక ఈ ఫంక్షన్ లో ఇప్పటి హీరో నవీన్ చంద్ర డాన్సర్ గా స్టేజి పై డాన్స్ వేశారు. ఇక ఆ ఫంక్షన్ కి ప్రభాస్ కోసం వచ్చిన జనాల్ని చూసి నవీన్ చంద్ర షాక్ అయ్యినట్లు రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
Also read : GoudSaab : ప్రభాస్ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. దర్శకుడిగా మారుతున్న డాన్స్ మాస్టర్..
దాదాపు నాలుగైదు లక్షల మంది ప్రభాస్ ని చూడడం కోసం ఆ ఫంక్షన్ కి వచ్చారు. వర్షం ప్రభాస్ కి కేవలం మూడో సినిమా. ఆ టైములోనే అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి నవీన్ చంద్ర షాక్ అవ్వడమే కాకుండా, హీరో అవ్వాలనే స్ఫూర్తిని పొందారట. హీరో అవుతే ఇంతటి ఫాలోయింగ్ వస్తుందా, అయితే నేను హీరోని అవుతా.. అని ఫిక్స్ అయ్యి నవీన్ చంద్ర నటన వైపు అడుగులు వేసారట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Prabhas’s Varsham 50 day’s function .. I’m seeing this “Crowd like almost 5-6 Lacs” in Bhimavaram. #Prabhas Garu 4-5 Film’s Old .. Aa Craze chusanu. ?❤️?? ..I became an Actor by seeing Prabhas in Varsham! ❤️ — Naveen Chandra pic.twitter.com/3P89wsQlfD
— — ÷ (@charanvicky_) April 10, 2024
కాగా వర్షం 175 డేస్ ఫంక్షన్ కి చిరంజీవి ముఖ్య అతిథిగా వెళ్లారు. ఒకే వేదిక పై కృష్ణంరాజు, చిరంజీవి, ప్రభాస్ కనిపించి ఆడియన్స్ ని ఫుల్ ఖుషి చేసారు. ఇక ఈ సినిమాని ఇటీవల రీ రిలీజ్ చేయగా.. హౌస్ ఫుల్ షోస్ తో మళ్ళీ థియేటర్స్ లో అదే జోష్ ని చూపింది.