GoudSaab : ప్రభాస్ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. దర్శకుడిగా మారుతున్న డాన్స్ మాస్టర్..
ప్రభాస్ ఫ్యామిలీ నుంచి మరో హీరో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఇక ఈ సినిమాతో టాలీవుడ్ స్టార్ డాన్స్ కొరియోగ్రాఫర్ దర్శకుడిగా పరిచయం మారుతున్నారు.

Prabhas Cousin Virat Raj debut with GoudSaab under Ganesh Master direction
GoudSaab : రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన హీరో ప్రభాస్. తన సక్సెస్ తో కృష్ణంరాజు లెగసీని మరో స్థాయికి తీసుకు వెళ్లారు. ఇప్పుడు ప్రభాస్ తో పాటు ఆ లెగసీని ముందుకు తీసుకు వెళ్లేందుకు మరో హీరో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ప్రభాస్ కజిన్ ‘విరాట్ రాజ్’ హీరోగా తెలుగు ఆడియన్స్ కి పరిచయం కాబోతున్నారు. నేడు ఈ మూవీ గ్రాండ్ గా లాంచ్ అయ్యింది.
ఈ మూవీతో విరాట్ రాజ్ హీరోగా పరిచయం అవ్వడమే కాదు, టాలీవుడ్ స్టార్ డాన్స్ కొరియోగ్రాఫర్ దర్శకుడిగా పరిచయం అవ్వబోతున్నారు. టాలీవుడ్ లో ఎన్నో సినిమాలకు డాన్స్ మాస్టర్ గా వర్క్ చేసిన గణేష్ మాస్టర్.. పవన్ కళ్యాణ్ సినిమాలతో తెలుగు ఆడియన్స్ లో ఎంతో ఫేమ్ ని సంపాదించుకున్నారు. ఇన్నాళ్లు డాన్స్ కోరియోగ్రఫీ చేస్తూ వచ్చిన గణేష్.. ఇప్పుడు దర్శకుడిగా మెగా ఫోన్ పట్టుకుంటున్నారు.
Also read : Bheems Ceciroleo : టాలీవుడ్‌కి కొత్త కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్ దొరికేశాడు.. ఇక దేవిశ్రీ, థమన్..
నేడు స్టార్ డైరెక్టర్ సుకుమార్ ముఖ్య అతిథిగా ఈ సినిమాని పూజాకార్యక్రమాలతో లాంచ్ చేసారు. ఎస్ ఆర్ కల్యాణమండపం రాజు, కల్వకోట వెంకట రమణ, సాయికృష్ణ కార్తీక్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి ‘గౌడ్‌సాబ్’ అనే టైటిల్ ని ఖరారు చేసారు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ని స్టార్ట్ చేసి శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసి ఆడియన్స్ ముందుకు తీసుకు రానున్నారు. మరి రెబల్ ఫ్యామిలీ నుంచి వస్తున్న విరాట్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటాడా లేదా చూడాలి.
Here’s the POWERFUL title poster of #ShreePaadaFilms PROD NO.1 titled as #GoudSaab ?
Launched by maverick director #Sukumar garu at Today’s Pooja Ceremony✨
⭐️ing #ViratRaj
Written & Directed by @GaneshMasterOff#Malleswari presents
Produced by: #SRKalyanamandapamRaju,… pic.twitter.com/XxWTCVIGl0— BA Raju’s Team (@baraju_SuperHit) April 10, 2024