Honey Glimpse
Honey Glimpse : నవీన్ చంద్ర, దివ్య పిళ్లై ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా హనీ. శేఖర్ స్టూడియోస్ సమర్పణలో OVA ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మాణంలో కరుణ కుమార్ దర్శకత్వంలో సైకలాజికల్ హారర్ మూవీగా హనీ సినిమా తెరకెక్కుతుంది.(Honey Glimpse)
నేడు న్యూ ఇయర్ సందర్భంగా హనీ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేసారు. రియల్ లైఫ్ లో జరిగిన పలు సంఘటనల ఆధారంగా మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాలు, డార్క్ సైకలాజికల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా ఉండబోతోంది. దివి, రాజా రవీంద్ర, బేబీ జయన్ని, బేబీ జయత్రి పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
హనీ సినిమా ఫస్ట్ గ్లింప్స్ మీరు కూడా చూసేయండి..
హనీ సినిమా ఫిబ్రవరి 6న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఇక హనీ సినిమా డిజిటల్ రైట్స్ ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్ కొనుక్కుంది.