Inspector Rishi Review : నవీన్ చంద్ర ‘ఇన్‌స్పెక్టర్ రిషి’ వెబ్ సిరీస్ రివ్యూ.. పర్ఫెక్ట్ హారర్ క్రైమ్ థ్రిల్లర్ అంతే..
అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న నవీన్ చంద్ర 'ఇన్‌స్పెక్టర్ రిషి' వెబ్ సిరీస్ రివ్యూ.. పర్ఫెక్ట్ హారర్ క్రైమ్ థ్రిల్లర్ అంతే..

Naveen Chandra Sunaina Yella Inspector Rishi web series review
Inspector Rishi Review : నవీన్ చంద్ర చాలా డిఫరెంట్ రోల్స్‌ని, స్టోరీస్ ని పిక్ చేసుకుంటూ వెళ్తుంటారు. ఈక్రమంలోనే రీసెంట్ గా ‘ఇన్‌స్పెక్టర్ రిషి’ అనే ఓ ఇంటరెస్టింగ్ వెబ్ సిరీస్ తో ఆడియన్స్ ముందుకు వచ్చారు. జేఎస్ నందిని డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ లో శ్రీకృష్ణ దయాల్, సునైనా యెల్లా, కన్నా రవి, మలిని జీవరత్నం, కుమారవేల్, మీశ ఘోషల్, సెమ్మలర్ అన్నం తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. హారర్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ తమిళ్ వెబ్ సిరీస్ తెలుగులో కూడా రిలీజ్ అయ్యింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇది స్ట్రీమ్ అవుతుంది.
కథ విషయానికొస్తే..
స్టోరీ మొదలవ్వడమే ఒక మాస్ సూసైడ్ తో ఓపెన్ అవుతుంది. కోయంబత్తూరు థెన్‌కాడు అడవుల్లో జీవించే ఒక ట్రైబల్ తెగ మొత్తం కలిసి ‘వనరచి’ అనే వనదేవతకి ప్రాణార్పణ చేసుకుంటారు. ఒక సమస్యని పరిష్కరించడం కోసం వారంతా కలిసి అలా మాస్ సూసైడ్ చేసుకొని వనరచిని మేల్కొల్పుతారు. ఆ తరువాత నుంచి ఆ అటవీ ప్రాంతంలో విచిత్రంగా హత్యలు జరగడం స్టార్ట్ అవుతాయి. ఆ హత్యలు వనరచినే చేస్తుందని పుకారు మొదలవుతుంది.
ఇక ఆ హత్యలను పరిష్కరించడం కోసం ప్రభుత్వం.. రిషి (నవీన్ చంద్ర) అనే పోలీస్ ఆఫీసర్ ని పంపిస్తుంది. ఇక ఈ వనరచి కథతో పాటు రిషి జీవితంలో జరిగిన ఒక సంఘటనని కూడా సిరీస్ లో చూపించుకుంటూ తీసుకు వెళ్తారు. మరి చివరికి రిషి ఆ హత్యలు వెనుక ఉన్న రహస్యం తెలుసుకున్నాడా..? అసలు వనరచి నిజంగానే ఉందా..? రిషి జీవితంలో జరిగిన విషయం ఏంటి..? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి.
వెబ్ సిరీస్ విశ్లేషణ..
హారర్ అండ్ క్రైమ్ జోనర్స్ ని మిక్స్ చేస్తూ చాలా సినిమాలు ఆడియన్స్ ముందుకు వచ్చి ఆకట్టుకున్నాయి. వాటి తరహాలోనే ఈ వెబ్ సిరీస్ కూడా ఆడియన్స్ ని ఆకట్టుకునేలా తెరకెక్కించారు. ఈ వెబ్ సిరీస్ మెయిన్ స్టోరీ లైన్ పాతదే అయినా, స్టైల్ ఆఫ్ మేకింగ్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. కొన్ని సీన్స్ అయితే వావ్ ఫీలింగ్ ని కలిగిస్తాయి. ఒకపక్క వనరచి కేసుని, మరోపక్క రిషి పర్సనల్ లైఫ్ ని బ్యాలన్స్‌డ్ గా చూపిస్తూ ఆడియన్స్ లో క్యూరియాసిటీని క్రియేట్ చేశారు.
ఇక ఈ వెబ్ సిరీస్ లో ఉన్నవి కేవలం రెండు మైనస్‌లు. ఒకటి సిరీస్ కొంచెం స్లోగా నడుస్తుంది. రెండో విషయం విలన్స్ కి సంబంధించిన కథని కేవలం మాటల్లో చెప్పేస్తారు. అలా కాకుండా వారి కథని కూడా కొంచెం విజువల్ గా చూపించి ఉంటే ఎఫెక్టివ్ గా ఉండేదేమో అనిపించింది. అంతే మిగతా అంతా చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది.
Also read : Vishwambhara : విశ్వంభర సెట్స్‌లో పవన్ కళ్యాణ్.. జనసేనకి చిరంజీవి రూ. 5 కోట్ల విరాళం
నటీనటుల విషయానికొస్తే..
రిషి పాత్రలో నవీన్ చంద్ర చాలా బాగా నటించాడు అని చెప్పడం కంటే జీవించాడు అనే చెప్పాలి. ప్రొఫిషినల్ అండ్ పర్సనల్ లైఫ్స్ మధ్య ఉండే తన పాత్రని నవీన్ చంద్ర చాలా బాగా ప్లే చేశారు. ఇక మిగిలిన ప్రధాన పాత్రల్లో నటించిన శ్రీకృష్ణ దయాల్, సునైనా యెల్లా, కన్నా రవి, మలిని జీవరత్నం, కుమారవేల్ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక అంశాలు..
నిర్మాణ విలువలు అయితే చాలా బాగున్నాయి. కొత్త లొకేషన్స్, అదిరిపోయే సినిమాటోగ్రఫీ సిరీస్ కి రిచ్‌నెస్ తీసుకువచ్చాయి. దర్శకురాలి నందిని టేకింగ్ ఆడియన్స్ ని థ్రిల్ చేస్తుంది. ఇక ఇలాంటి హారర్ క్రైమ్ థ్రిల్లర్స్ కి అవసరమైన మ్యూజిక్ ని అశ్వత్ పర్ఫెక్ట్ గా సమకూర్చారు.
మొత్తంగా చెప్పాలంటే, హారర్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్స్ ని ఇష్టపడే వారికీ ఈ సిరీస్ బాగా నచ్చేస్తుంది. పది ఎపిసోడ్స్ తో ఉన్న ఈ సిరీస్ అమెజాన్ లో తెలుగు, తమిళతో పాటు హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా అందుబాటులో ఉంది.