Vishwambhara : విశ్వంభర సెట్స్‌లో పవన్ కళ్యాణ్.. జనసేనకి చిరంజీవి రూ. 5 కోట్ల విరాళం

విశ్వంభర సెట్స్‌లో మెగా బ్రదర్స్ ఒకటిగా కనిపించి ఫ్యాన్స్ కి కనులవిందు చేశారు. అంతేకాదు జనసేనకి చిరంజీవి భారీ విరాళం..

Vishwambhara : విశ్వంభర సెట్స్‌లో పవన్ కళ్యాణ్.. జనసేనకి చిరంజీవి రూ. 5 కోట్ల విరాళం

Pawan Kalyan at Chiranjeevi Vishwambhara movie sets photos gone viral

Updated On : April 8, 2024 / 5:58 PM IST

Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వశిష్ఠ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం హైదరాబాద్ శివారు ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటుంది. అక్కడ వేసిన ప్రత్యేక సెట్ లో చిరంజీవిపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఇదిలావుంటే, ఈరోజు ఈ మూవీ సెట్స్ లో మెగా బ్రదర్స్ ఒకటిగా కనిపించి ఫ్యాన్స్ కి కనులవిందు చేశారు.

మరో నెలలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. దీంతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏపీలో ప్రచారాలు చేస్తూ వస్తున్నారు. ఇక ఈ ఎన్నికల్లో తమ్ముడికి ఆర్ధికంగా తోడుగా ఉండాలని చిరంజీవి భావించారు. అందుకనే తమ్ముడికి సహాయం చేసేందుకు పవన్ ని ప్రత్యేకంగా పిలిపించుకొని.. జనసేన ఎన్నికల నిర్వహణ కోసం రూ.5 కోట్ల రూపాయిలను విరాళంగా ఇచ్చారు. కేవలం చిరంజీవి మాత్రమే కాదు, రామ్ చరణ్ కూడా ఈ ఎన్నికల్లో బాబాయికి తోడుగా నిలిచేందుకు నిర్ణయం తీసుకున్నారట.

Also read : Sandeep Reddy Vanga : ‘ఉప్పెన’ చూసి అలా ఫీల్ అయిన సందీప్ వంగ.. అలాగే ఆ రెండు బయోపిక్స్..

ఇక విశ్వంభర సినిమా విషయానికి వస్తే.. సోషియో ఫాంటసీ నేపథ్యంలోనే తెరకెక్కబోతుంది. మూవీలో ఆల్మోస్ట్ 70 శాతం షాట్స్ ని VFX పైనే డిజైన్ చేస్తున్నట్లు మేకర్స్ పేర్కొన్నారు. త్రిష ఈ సినిమాలో ఫిమేల్ లీడ్ చేస్తున్నారు. 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ సినిమా తీసుకు వస్తామంటూ ఆల్రెడీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. ఈ సినిమా పై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఆ అంచనాలకు తగ్గట్టు యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.