Naveen Polishetty Anushka Miss Shetty Mr PoliShetty Movie OTT Streaming Date and Platform announced Details Here
Miss Shetty Mr PoliShetty Movie : యువ హీరో నవీన్ పోలిశెట్టి ప్రస్తుతం వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయ, జాతి రత్నాలు లాంటి సినిమాలతో భారీ హిట్స్ కొట్టి ఇటీవల అనుష్కతో కలిసి వచ్చి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో మరో హిట్ కొట్టి హ్యాట్రిక్ తో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. నవీన్ పోలిశెట్టి, అనుష్క జంటగా నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా ఇటీవల సెప్టెంబర్ 7న థియేటర్స్ లో రిలీజయి మంచి విజయం సాధిచింది.
నవీన్ కెరీర్ లో 50 కోట్లు కలెక్ట్ చేసిన మొదటి సినిమాగా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ నిలిచింది. ఫుల్ లెంగ్త్ కామెడీ, క్యూట్ లవ్, క్లైమాక్స్ లో ఎమోషనల్ సన్నివేశాలతో అన్ని రకాల ప్రేక్షకులని మెప్పించారు. అమెరికాలో కూడా దాదాపు 2 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ వసూలు చేసింది. థియేటర్స్ లో సక్సెస్ అయిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది.
Also Read : Kannappa Movie : కన్నప్పలో మలయాళం స్టార్ హీరో.. విష్ణు ఇంకెంతమందిని తీసుకొస్తాడో??
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా ప్రముఖ ఓటీటీ(OTT) నెట్‌ఫ్లిక్స్(Netflix) లో అక్టోబర్ 5 నుంచి స్ట్రీమింగ్ అవ్వనుంది. నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా స్ట్రీమింగ్ అవ్వనుంది. దీంతో ఈ సినిమాని మరోసారి ఓటీటీలో చూసి నవ్వుకోడానికి సిద్ధమయ్యారు ప్రేక్షకులు. థియేటర్స్ లో మిస్ అయిన వాళ్ళు ఉంటే ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాని నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో అక్టోబర్ 5 నుంచి చూసేయండి.