Naveen Polishetty increased remuneration after Anaganaga Oka Raju movie hit. (1)
Naveen Polishetty: టాలీవుడ్ లో స్టార్ ఎంటర్టైనర్ గా పేరు తెచ్చుకున్నాడు నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty). చాలా కాలం నుంచే ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ వస్తున్నప్పటికీ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో హీరోగా మొదటి సక్సెస్ అందుకున్నాడు. క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ తరువాత వచ్చిన జాతి రత్నాలు గురించి ఎంత చెప్పినా తక్కువే. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఒప్పింది.
ఈ రెండు సినిమాల తరువాత స్టార్ బ్యూటీ అనుష్కతో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా చేసి మంచి హిట్ అందుకున్నాడు. ఇక తాజాగా వచ్చిన అనగనగా ఒక రాజు బ్లాక్ బస్టర్ సాధించింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా ఏకంగా రూ.100 కోట్ల గ్రాస్ సాధించి నవీన్ పోలిశెట్టి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇలా వరుసగా నాలుగు హిట్స్ తో ప్రెజెంట్ జనరేషన్ హీరోలలో టాప్ లో కొనసాగుతున్నాడు ఈ హీరో.
Pradeep Ranganathan: మళ్ళీ డైరెక్టర్ గా ప్రదీప్ రంగనాథన్.. మీనాక్షి, శ్రీలీలతో ‘మ్యాజిక్’ చేస్తాడట!
అయితే, వరుసగా నాలుగు సినిమాలు హిట్స్ పడటంతో నిర్మాతలకు కొత్త కండీషన్స్ పెడుతున్నాడట నవీన్ పోలిశెట్టి. అదేంటంటే, నవీన్ పోలిశెట్టి బేసిక్ గా రైటర్. అది ఆయనకు బాగా కలిసొచ్చిన పాయింట్. అందుకే, ప్రతీ సినిమా కథ విషయంలో దగ్గరుండి చూసుకుంటాడు. అందుకే, తన తరువాతి సినిమాల విషయంలో కూడా అదే కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాడట. ఇదే మేకర్స్ పెడుతున్న మొదటి కండీషన్.
ఇక రెండవది ఏంటంటే, రెమ్యునరేషన్. వరుసగా నాలుగు హిట్స్ పడటంతో తరువాతి సినిమా కోసం ఏకంగా రూ.15 నుంచి రూ.20 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఆడుతున్నాడట ఈ హీరో. నిజానికి, ప్లాప్ లో ఉన్న హీరోలే రూ.30, రూ.40 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నప్పుడు నవీన్ పోలిశెట్టి రూ.15 కోట్లు డిమాండ్ చేయడం అనేది పెద్ద విషయమేమి కాదని మేకర్స్ కూడా భావిస్తున్నారట. ఇలా ఈ రెండు కొత్త కండీషన్స్ తో మేకర్స్ ముందుకు వెళుతున్నాడట నవీన్ పోలిశెట్టి.